అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో విజయ్ దేవ‌ర‌కొండ‌కు ఎంత పేరు తెచ్చిపెట్టిందో, హిందీలో షాహిద్ కపూర్‌కీ, కియారా అద్వానీకి అంత‌క‌న్నా ఎక్కువ పేరు తెచ్చింది. ప్రీతి కేర‌క్ట‌ర్‌లో రెచ్చిపోయి న‌టించింది కియారా. అప్ప‌టికే ల‌స్ట్ స్టోరీస్ రిలీజై ఉండ‌టం, కియారాకు ఓ రేంజ్‌లో క్రేజ్ ఉండ‌టంతో ప్రీతి కేర‌క్ట‌ర్ అంత‌గా క‌నెక్ట్ అయింది జ‌నాల‌కు.ఆ సినిమా మ‌ధ్య‌లో ఉండ‌గానే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కియారా క‌లిసి ఓ యాడ్ కూడా చేశారు. అదంతా పాత క‌హానీ అనుకున్నా, ఇప్పుడు మ‌ళ్లీ విజ‌య్‌నే ఫాలో అవుతోంది కియారా.
లేటెస్ట్ సినిమా లైగ‌ర్‌లో ఎంఎంఏ కాంపిటిట‌ర్‌గా క‌నిపించాడు విజ‌య్‌. దాని కోసం విజ‌య్ ప‌డ్డ క‌ష్టం స్క్రీన్ మీద అంద‌రికీ క‌నిపించింది.ఇప్పుడు కియారా రియ‌ల్ లైఫ్‌లోనూ ఎంఎంఏ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ఆమెకు ట్రెయినింగ్ ఇస్తున్న ఎంఎంఎ ల‌లిత్ కియారా వీడియో షేర్ చేశారు. ఆమె హార్డ్ వ‌ర్క్ కి, డెడికేష‌న్‌కీ ఫిదా అయిపోయిన‌ట్టు చెప్పారు. కిక్ బాక్సింగ్‌లో కియారా ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారో చూపించారు. ఈ వీడియో చూస్తుంటే కియారా త్వ‌ర‌లోనే యాక్ష‌న్ పార్ట్ కి కూడా రెడీ అవుతున్న‌ట్టు అనిపిస్తోంది. ఆల్రెడీ స‌మంత కూడా ఎంఎంఏ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.మొన్నీమ‌ధ్య వ‌ర‌కు బ‌యోపిక్స్ వ‌రుస‌గా రిలీజ్ అయిన‌ట్టు, త్వ‌ర‌లో హీరోయిన్ల యాక్ష‌న్ సీక్వెన్స్ సిల్వ‌ర్ స్క్రీన్ మీద అందాల దాడి చేయ‌బోతున్నాయా? సిట్చువేష‌న్ చూస్తుంటే అలాగే ఉంది మ‌రి.

, , , ,