మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ఖిలాడీ నుంచి అదిరిపోయే మాస్ నంబర్ ను విడుదల చేశారు. రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగానే పూర్తిగా కిక్ ఇచ్చేలా ఉందీ సాంగ్. క్రాక్ చిత్రంలోని బిర్యానీ పాట ఎలా ఊపేసిందే ఈ పాట కూడా అలాగే ఊపేసేలా కనిపిస్తోంది. మామూలుగా రవితేజ కు ఇలాంటి పాటలు బాగా సూట్ అవుతాయి. వాటికి తగ్గట్టుగానే మాస్ స్టెప్స్ తో నెక్ట్స్ లెవల్ అనేలా ఫుల్ కిక్ అంటూ సాగుతోందీ పాట. మాస్ రాజాతో పాటు హీరోయిన్ డింపుల్ హయాతీ పై చిత్రీకరినించిన ఈ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాడు. అంటే థియేటర్స్ లో రవితేజ ఫ్యాన్స్ కు కూడా అదే రేంజ్ లో కిక్ గ్యారెంటీ అనుకోవచ్చు.
‘‘నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సూ.. ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్స్.. అది ఒంటిలోన చేసిన అల్లరి నీకేం తెల్సు.. నువ్వు కళ్లతోని విసురుతుంటే లవ్ సిగ్నల్సు.. నా ఈడులోన షురూ ఇంక ఎఫ్ 1 రేసూ.. బ్రేకుల్లేని బ్రేకుడ్యాన్సు నీకేం తెల్సూ.. ఫుల్ కిక్కూ ’’ అంటూ సాగే ఈ సాంగ్ నిజంగానే మంచి హుషారుగా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని పాటను దేవీ తమ్ముడు సాగర్ తో పాటు మమతాశర్మ ఆలపించారు.
ఇక ఈ పాటతో పాటు మరో స్ట్రాంగ్ అప్డేట్ కూడా ఇచ్చింది ఖిలాడీ టీమ్. ఇప్పటి వరకూ ఈ సినిమా రిలీజ్ డేట్ పై కొందరిలో అనుమానాలున్నాయి. అవేం అక్కర్లేదు అంటూ చెప్పిన డేట్ కే ఖిలాడీ థియేటర్స్ లోకి రాబోతోందని డిక్లేర్ చేశారు. అంటే ముందే చెప్పినట్టు.. ఫిబ్రవరి 11న సినిమా విడుదల కాబోతోందన్నమాట. మరి ఈ డేట్ కు మరీ ఎక్కువ టైమ్ లేదు కాబట్టి.. నెక్ట్స్ వీక్ నుంచి ఖిలాడీ ప్రమోషన్స్ తో మాస్ రాజా మరోసారి తనదైన శైలిలో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధం అవుతున్నాడని చెప్పొచ్చు.

, , , , , , , , , , , , , , , , ,