మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న‌ డింపుల్ హయత్, మీనాక్షి చౌద‌రి న‌టించారు. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ష‌సుడు సినిమాతో స‌క్స‌స్ సాధించిన‌ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ టీజ‌ర్, ట్రైల‌ర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో ఖిలాడి సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుద‌ల అవ్వ‌డం విశేషం. ఈ రోజు అన‌గా ఫిబ్ర‌వ‌రి 11న ఖిలాడి చిత్రం విడుద‌లైంది. క్రాక్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ర‌వితేజ ఖిలాడి మూవీతో మ‌రో విజ‌యం సాధించాడా..? లేదా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక ఖిలాడి క‌థ విష‌యానికి వ‌స్తే… ఈ సినిమాలో ర‌వితేజ‌ ఓ గ్యాంబ్లర్. అంటే పెద్ద ఖిలాడి. ఆయ‌న పాత్ర పేరు మోహన్ గాంధీ. మనీ కంటెయినర్ ను మోహన్ గాంధీ దోచుకోవడంతో కథ స్టార్ట్ వుతుంది. పోలీస్ ఆఫీసర్ తో పాటు సినిమాలో విలన్లు కూడా ఆ కంటెయినర్ కోసం తెగ‌ వెతుకుతుంటారు. అయితే… మోహన్ గాంధీ మాత్రం ఆ మనీ కంటెయినర్ లోనే కూర్చొని పోలీస్, విలన్లకు సవాల్ విసురుతుంటాడు. చివ‌ర‌కు ఆ మ‌నీ కంటెయిన‌ర్ పోలీసుల‌కు దొరికిందా..? విల‌న్ ల‌కు దొరికిందా..? లేక ర‌వితేజ ద‌గ్గ‌ర ఉందా..? ఈ క్ర‌మంలో మోహ‌న్ గాంధీకి వ‌చ్చిన అడ్డంకులు ఏంటి..? వాటిని ఎలా అధిగ‌మించాడు..? అనేదే మిగిలిన క‌థ‌.

న‌టీన‌టుల ప‌ర్ ఫార్మెన్స్ విష‌యానికి వ‌స్తే… మ‌న మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎప్ప‌టిలానే త‌న‌దైన స్టైల్ లో చాలా ఈజ్ తో న‌టించి అద‌ర‌గొట్టేసాడు అనిపించాడు. తన మార్క్ డైలాగ్స్ అండ్ మేన‌రిజ‌మ్స్ తో మ‌రోసారి ఆడియ‌న్స్ ని విశేషంగా ఆక‌ట్టుకున్నాడు. పోలీసాఫీస‌ర్ గా న‌టించిన సీనియ‌ర్ హీరో అర్జున్ కూడా పాత్ర స్వ‌భావాన్ని పూర్తి అర్థం చేసుకుని ఆ పాత్ర‌లో న‌టించారు. ఇక హీరోయిన్స్ మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌త్ తమ అందం, అభిన‌యంతో మెప్పించారు.

ఈ సినిమాకి ర‌వితేజ న‌ట‌న‌, స్ర్కీన్ ప్లే, యాక్ష‌న్ సీన్స్, రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్ల‌స్ అని చెప్ప‌చ్చు. అయితే… సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికి టైమ్ తీసుకోవ‌డంతో అక్క‌డ‌క్క‌డా సాగ‌దీసిన‌ట్టు అనిపిస్తుంటుంది. కామెడీ కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం ఈ సినిమాకి పెద్ద‌ మైన‌స్ అని చెప్ప‌చ్చు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతం అందించారు. ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌ సినిమాని ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో తెర‌కెక్కించారు. ట్విస్టులు బాగున్నాయి అయితే.. దీనికి ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రాసుకోవ‌డంలో మాత్రం త‌డ‌బ‌డ్డాడు అని చెప్ప‌చ్చు. ప్ర‌స్తుతం భారీ చిత్రాలేవి పోటీ లేక‌పోవ‌డం.. ఈ సినిమాకి క‌లిసిరావ‌చ్చు. ఈ సినిమా గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే… ర‌వితేజ ఫ్యాన్స్ కి మాత్ర‌మే ఈ ఖిలాడి న‌చ్చుతుంద‌ని చెప్ప‌చ్చు.

, , , , , , , , , , , , , , , , ,