కాన్ఫిడెన్స్ అంటే ఇదే అనుకోవాలా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా అనేది చెప్పలేం కానీ.. సినిమా రిలీజ్ కు ముందే అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ కార్ ను  దర్శకుడు రమేష్ వర్మకు గిఫ్ట్ గా ఇచ్చాడు ఖిలాడీ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ. ఇది కేవలం అవుట్ పుట్ చూసిన తర్వాత నిర్మాతకు కలిగిన నమ్మకం వల్ల ఇచ్చిన గిఫ్ట్ అని చెబుతున్నారు. ఓ రకంగా ఇలాంటి ఇన్సిడెంట్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్ కావొచ్చు. వంద సంవత్సరాల తెలుగు సినిమా పరిశ్రమలో రెమ్యూనరేషన్స్ ఎగ్గొట్టిన నిర్మాతలను చూశాం. అలాగే సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత కార్లు, ఇళ్లు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాతలనూ చూశాం. కానీ రిలీజ్ కు ముందే.. కేవలం అవుట్ పుట్ ను ఇంత కాస్ట్ లీ గిఫ్ట్ ఇవ్వడం దాదాపు ఇదే ఫస్ట్ టైమ్ అనుకోవచ్చు.
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతీ, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ ప్రధాన పాత్ర చేశాడు. రమేష్ వర్మకు ఇది రవితేజతో రెండో సినిమా. గతంలో వీర అనే చిత్రం చేశాడు. అది ఫ్లాప్. తర్వాత రెండేళ్ల క్రితం తమిళ్ లో హిట్ అయిన రాక్షసుడు చిత్రాన్ని మక్కీకి మక్కీ తెలుగులో దించి తనూ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన అవకాశమే ఖిలాడీ. ఇప్పటి వరకూ ఖిలాడీకి సంబంధించిన వచ్చిన అప్డేట్స్ అన్నీ ప్రామిసింగ్ గానే ఉన్నాయి. ఈ కారణంగానే నిర్మాత ఇంప్రెస్ అయ్యాడనుకోవచ్చు. దానికి తోడు సినిమా రైట్స్ కూడా ఓ రేంజ్ లో అమ్ముడయ్యాయి.
క్రాక్ తర్వాత రవితేజ నుంచి వస్తోన్న చిత్రం కాబట్టి ఖిలాడీకి అద్భుతమైన రేట్స్ వచ్చాయి. ఇప్పటికే సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు అమ్మేశారు. ఆ ఆనందం కూడా నిర్మాతలో కనిపించవచ్చు. అందుకే ఖిలాడీపై పూర్తి నమ్మకంతోనే ఇలా రిలీజ్ కు ముందే దర్శకుడికి ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు.
కాకపోతే ఇలా ల్యాబుల్లో మోస్ట్ కాన్ఫిడెంట్ గా కనిపించి.. థియేటర్స్ తుస్సుమన్న చిత్రాలూ ఉన్నాయి. అయినా నిర్మాత ధైర్యం చేశాడంటే.. ఆల్రెడీ అమ్మేశాను అన్న కాన్ఫిడెన్స్ కావొచ్చు. లేదా ఖచ్చితంగా హిట్ కొడుతున్నామన్న నమ్మకమూ కావొచ్చు.

, , , , , , , , , , , , , , , , ,