కంటెంట్ కరెక్ట్ గా ఉంటే సీక్వెల్స్ కూడా హిట్ అవుతాయని లేటెస్ట్ గా కార్తికేయ2 నిరూపించింది. ఫస్ట్ పార్ట్ కంటే పెద్ద హిట గా నిలిచిందీ చిత్రం. పైగా బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది. ఆ ధైర్యమో లేక ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాడో కానీ ఖిలాడీ దర్శకుడు రమేష్‌ వర్మ కూడా సీక్వెల్ కు సిద్ధం అయ్యాడు. బట్ దర్శకుడుగా ఇప్పటి వరకూ అతను తనదైన ముద్రను వేయలేదు. అలాంటిది తనది కాని సినిమాకు సీక్వెల్ తో వస్తే ఆడియన్స్ ఆదరిస్తారా లేదా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. ఈ చిత్రం కోసం ఓ క్రేజీ కపుల్ ను ఒప్పించాడట. మరి ఆ కపుల్ ఎవరు..? ఏ సినిమాకు సీక్వెల్ తో వస్తున్నాడు..?తమిళ్ లో వచ్చిన రాచ్చసన్ కు రీమేక్ గా రమేష్ వర్మ రాక్షసుడు అంటూ తెలుగులో చేసి ఇక్కడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ అతనికీ ఫస్ట్ హిట్ గా నిలిచింది.

అప్పట్లోనే రాక్షసుడుకు సీక్వెల్ ఉంటుందని ప్రచారం జరిగింది. ఇండియాలో జెన్యూన్ గా వచ్చిన మర్డర్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ గా రాక్షసుడు సినిమాను చెప్పొచ్చు. అందుకే ఇది చాలా భాషల్లో రీమేక్ అయింది. ఇప్పుడు హిందీలో కూడా అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేశాడు. రీసెంట్ గా ఈ ట్రైలర్ కూడా విడుదలైంది. ఇక రమేష్‌ వర్మ .. రవితేజతో చేసిన ఖిలాడీ బాక్సాఫీస్ వద్ద పోయింది. దీంతో ఇంక అతనికి వేరెవరూ ఛాన్స్ ఇవ్వరు అనుకున్నారు. బట్ రాక్షసుడుకు కొనసాగింపుగా మరో చిత్రంతో రాబోతున్నాడు.రాక్షసుడు సినిమా గురించి సౌత్ లో దాదాపు అందరికీ తెలుసు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేలా కన్నడ హీరో సుదీప్ తో ఈ చిత్రం చేయబోతున్నాడని టాక్. రీసెంట్ గా సుదీప్ విక్రాంత్ రోణతో మెప్పించాడు.

పైగా అతను సౌత్ లోని ఆడియన్స్ అందరికీ బాగా తెలిసిన వాడు. టాలెంటెడ్ కూడా. హీరోయిన్ గా మాళవిక మోహనన్ ను సెలెక్ట్‌ చేసుకున్నారు. తనూ కొంత వరకూ తెలిసిన హీరోయిన్నే. అలాగే విలన్ పాత్రలో విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకుంటున్నారట. ఈ ఇద్దరూ ఒప్పుకున్నారు. విజయ్ సేతుపతి కూడా ఓకే అంటే ఇదో భారీ సినిమా అవుతుంది. క్రేజ్ కూడా డబుల్ అవుతుంది. మొత్తంగా ఖిలాడీ పోయినా.. క్రేజీ కపుల్ తో రాక్షసుడు2తో రాబోతున్నాడు రమేష్‌ వర్మ. రాక్షసుడు మర్డర్ మిస్టరీగా వస్తే.. ఈ పార్ట్ మాత్రం హారర్ థ్రిల్లర్ గా ఉంటుందట. మరి ఎలా ఉంటుందో చూడాలి.

, , , , , ,