Advertisement
రివ్యూ : కెజీఎఫ్ చాప్టర్-2
Bollywood Hollywood Latest Movies Regional Reviews Tollywood

రివ్యూ : కెజీఎఫ్ చాప్టర్-2

Advertisement
రివ్యూ : కెజీఎఫ్ చాప్టర్-2
తారాగణం : యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రవీనాటాండన్, రావు రమేష్ తదితరులు
సంగీతం : రవి బస్రూర్
కెమెరామేన్ : భువన్ గౌడ
నిర్మాత : విజయ్ కిరంగదూర్
దర్శకత్వం : ప్రశాంత్ నీల్
కెజీఎఫ్.. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి దేశం మొత్తాన్ని ఊపేసిన సినిమా. అప్పటికే వచ్చిన బాహుబలి మేనియాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లిన సినిమా కెజీఎఫ్. అటు ఓటిటిలో కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. అలాంటి చిత్రానికి రెండో భాగం వస్తోందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు. మరి ఆ అంచనాలను కెజీఎఫ్ రెండో చాప్టర్ అందుకుందా లేదా అనేది చూద్దాం..
కథ : ముంబై నుంచి కెజీఎఫ్ కు చేరుకుని అక్కడ గరుడను చంపేస్తాడు రాఖీ(యశ్). అటుపై కెజీఎఫ్ ను ఆధిపత్యం సంపాదిస్తాడు. తనకు ఎదురు వచ్చిన ఎవర్నైనా సరే చంపేస్తూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. తనతో పాటు తనను అక్కడికి రప్పించిన రాజేంద్రదేశాయ్ కూతురును కూడా తీసుకువస్తాడు. కెజీఎఫ్ పై ఆధిపత్యం కోసమే అతన్ని రప్పించిన వారికి రాకీ ఎదురు తిరగడం నచ్చదు. దీంతో అతన్ని చంపేయాలని ప్రయత్నిస్తూ.. అప్పటికే మరణించాడని భావించిన అథీరా(సంజయ్ దత్)ను దింపుతారు. అత్యంత కౄరుడైన అధీరా వచ్చీ రాగానే రాకీని చంపేసినంత పనిచేస్తాడు. చావు నుంచి తప్పించుకున్న రాకీ ఆ అధీరాను ఎలా అంతమొందించాడు.. కెజీఎఫ్ గురించి తెలిసిన ప్రధానమంత్రిని ఎలా ఫేస్ చేశాడు అనే అంశాలుతో మిగతా కథ సాగుతుంది..?
విశ్లేషణ :మొదటి భాగాన్ని అత్యంత ఇంట్రస్టింగ్ గా ఫినిష్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో సెకండ్ చాప్టర్ పై అంచనాలు పెంచాడు. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సక్సస్ అయ్యాడా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ చాప్టర్ టేకాఫ్ చాలా స్లోగా మొదలవుతుంది. మొదటి భాగం చూడని వారికి అయితే అస్సలే మాత్రం అర్థం కాదు కదా.. ఇదేంటీ సోది అన్నట్టుగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. పైగా కెజీఎఫ్ ను తన ఆధీనంలోకి తెచ్చుకున్న రాకీ అక్కడి జనం మనసులను మాత్రం గెలుచుకోడు. వారితో అదే వెట్టి చాకిరీ చేయిస్తూ.. అంతకు ముందు ఉన్న గరుడ వంటి వారికంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయిస్తుంటాడు. సరే హీరో క్యారెక్టర్ అదే అనుకున్నా.. హీరోయిన్ ను తెచ్చుకుని ‘‘ఉంచుకుంటా’’ అని చెప్పించడం.. తల్లిని అత్యంతగా గౌరవించే హీరో పాత్రకు ఔచిత్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఆమె కూడా విధిలేని పరిస్థితుల్లోనే తనకు ఐ లవ్యూ చెబుతుంది. కానీ ఆ తర్వాత ఎంతో కాలం బ్రతకదు. ఇదంతా హీరో క్యారెక్టరైజేషన్ ను దిగజార్చడమే అవుతుంది. అధీరా ఎంట్రీ తర్వాత స్క్రీన్ ప్లే టగ్ ఆఫ్ వార్ లా ఉంటుందనుకుంటే సింగిల్ షూట్ తో హీరోను పడేస్తాడు అధీరా. ఆ తర్వాత తన బలం పెంచుకోవడానికి దుబాయ్ వెళ్లి అధునాతన ఆయుధాలు తెచ్చుకుంటాడు. సెకండ్ హాఫ్ స్టార్ట్ కాగానే తను తెచ్చుకున్న ఆయుధాలతో అధీరాపై ఒక్కసారిగా దాడి చేస్తాడు. అదేంటో రాకెట్ లాంచర్స్ ప్రయోగించినా అతను బ్రతికే ఉంటాడు. ఇలా హీరో కాల్చి చంపకుండా, అధీరాపై కాల్పులు జరిపి చంపకుండా వదిలేసినప్పుడే కథ కూడా చనిపోయింది. ఇక ఆ తర్వాత అంతా సాగదీత వ్యవహారమే. పైగా సెకండ్ హాఫ్ లో వచ్చే పాటలన్నీ సరైన ప్లేస్ మెంట్ లో కనిపించవు. హీరోను అత్యంత దుర్మార్గుడుగా ఎస్టాబ్లిష్ చేస్తూ.. అతన్నో వీరుడు శూరుడు అంటూ పొగుడుతూ పాటలు పెట్టడం ఏంటో అర్థం కాదు. ఇక కేవలం ఒక్క బంగారు బిస్కట్ తీసుకువెళ్లారని పోలీస్ స్టేషన్ పైనే దాడి యడం చూస్తే.. సిల్లీగా అనిపిస్తుంది తప్ప మరోటి కాదు. ఈ షాట్ ను ట్రైలర్ లో చూసిన చాలామంది గొప్పగా ఊహించుకుంటే అది కాస్తా తుస్సుమంటుంది.
అత్యంత దుర్మార్గం ఏంటంటే.. హీరో(విలనే అనాలేమో) పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా.. అందులోకి వెళ్లి ప్రధాన మంత్రి(రవీనాటాండన్ వేసిందీ పాత్ర) ముందే తన ప్రత్యర్థిని చంపేయడం.. ప్రశాంత్ నీల్ ‘‘ఫుల్ బాటిల్ ఎఫెక్ట్’’ ను చూపిస్తుంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి సీన్స్. అయినా ఇదో అద్భుతం అనుకుంటే ఏం చేయలేం. మొత్తంగా తల్లి చెప్పిన మాటను పాటిస్తూ.. అత్యంత ధనవంతుడు కావాలనుకున్న హీరో అన్ని అడ్డదారులు తొక్కి ఆఖర్లో అంతం అయినట్టూ కానట్టూ చూపించారు. అంటే మరో పార్ట్ ఉంటుందేమో కానీ.. ఈ పార్ట్ చూసిన తర్వాత మరోటి అక్కర్లేదని అందరికీ అర్థమౌతుంది. ఇక సినిమాకు మెయిన్ హైలెట్ అంటే యశ్ నటనే. మరోసారి తన స్వాగ్ ను చూపించాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ అద్భుతమైన ఆధిపత్యం చూపించాడు. అధీరాగా సంజయ్ దత్ స్టేటస్ పనిచేస్తుంది కానీ పాత్రకు అంత సీన్ లేదు. ప్రకాష్ రాజ్ కథను నెరేట్ చేస్తుంటాడు కాబట్టి.. నటన గురించి ఏం లేదు. రావు రమేష్ సిబిఐ ఆఫీసర్ గా సూట్ కాలేదు. రవీనాటాండన్ బాగా చేసింది. హీరోయిన్ కేవలం ఉత్సవ విగ్రహంలా కనిపిస్తుందంతే. మిగతా పాత్రలన్నీ రొటీన్ వే.
ఇక ఎప్పట్లానే సినిమాకు నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరాయి. ఈ రెండు విభాగాలూ బ్యాక్ బోన్ లా నిలిచాయి. అయితే కలర్ టింట్ మాత్రం ఈ సారి ఇబ్బంది పెట్టింది. ఎవరి మొహమూ స్పష్టంగా కనిపించడం లేదు. దర్శకుడుగా ప్రశాంత్ తనపై ఉన్న అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఎడిటింగ్ చాలా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ నెక్ట్స్ లెవెల్ అంతే. సెట్స్, ఆర్ట్ వర్క్ కథ మూడ్ ను సస్టెయిన్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.
ఫైనల్ గా :కెజీఎఫ్ చాప్టర్ 2.. ఈ చాప్టర్ తో క్లోజ్ చేస్తే బెటర్..

రేటింగ్ : 1.5/5

– యశ్వంత్ బాబు

Advertisement

Post Comment