ఇండస్ట్రీకి వచ్చిన ఏ బ్యూటీ అయినా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని కలలు కంటారు. కొందరు మాత్రమే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటారు. అలాంటి వారే ప్రయోగాలు ముందుంటారు. సోలోగా అయినా సత్తా చాటాలని ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాల్లో ఇప్పటి వరకూ ఒక్కసారే బ్లాక్ బస్టర్ అనిపించుకున్న భామ కీర్తి సురేష్‌. మహానటితో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి ఇప్పటికే ఓటిటి వేదికగా సోలోగా చాలా సినిమాలు చేసింది. బట్ అవన్నీ పోయాయి. ఇప్పుడు మరోసారి ఓ ఛాలెంజింగ్ రోల్ కు ఓకే చెప్పిందట.ఆర్టిస్టులు ఎక్స్ పర్మెంట్స్ చేస్తేనే ఎక్స్ ప్లోర్ అవుతారు. అలా చేయడంలో కీర్తి సురేష్‌ ముందు నుంచీ ముందే ఉంటోంది. అందుకే చాలా తక్కువ టైమ్ లోనే తన అకౌంట్ లో నేషనల్ అవార్డ్ పడింది.

అలాగే రెగ్యులర్ హీరోయిన్ గా ఫేమ్ కావాల్సిన టైమ్ లో ఓ బిడ్డకు తల్లిగా, ప్రెగ్నెంట్ లేడీగా పెంగ్విన్ సినిమా చేసి ఆశ్చర్యపరిచింది. తర్వాత కూడా అలాంటి ప్రయోగాత్మక సినిమాలు చాలానే చేసింది. వాటి సక్సెస్ రేట్ పక్కన బెడితే తన నటన మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇక తన పని ఐపోయింది అనుకుంటోన్న టైమ్ లో రీసెంట్ గా సాని కాయిదం అనే సినిమాలో తన నటన చూసి చాలామంది భయపడ్డారు. ఒక పాత్ర కోసం హీరోయిన్ ఇంత రగ్గ్ డ్ గా కనిపిస్తుందా అని ఆశ్చర్యిపోయారు. ఆపై కీర్తిని ప్రశంసల్లో ముంచెత్తారు.ప్రస్తుతం తెలుగు, తమిళ్, మళయాల సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అది కూడా మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న సుధా కొంగర దర్శకత్వంలో. కెజీఎఫ్ ను నిర్మించిన హోంబలే పిక్చర్స్ బ్యానర్ నిర్మించే సినిమా ఇది.

ఈ సినిమా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందట. అందుకోసం దేశవ్యాప్తంగా చాలామంది హీరోయిన్లను సంప్రదించింది సుధ. బట్ వాళ్లెవరూ ఈ రోల్ చేయలేమన్నారు. దీంతో కీర్తి సురేష్‌ ముందుకు వచ్చిందా పాత్ర. తను వెంటనే సైన్ చేసిందంటున్నారు. ఇది కాస్త రిస్కీ రోల్ అంటున్నారు. ఇప్పటి వరకూ ఛాలెంజింగ్ రోల్స్ తో మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్ ఈ రిస్కీ రోల్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

, , , , ,