ఆగస్ట్ టాలీవుడ్ కు హ్యాపీ న్యూస్ లే చెబుతోంది. వరుసగా రెండు వారాల సినిమాలూ హ్యాపీ న్యూస్ లే చెప్పాయి. రెండో వారం మిక్స్ డ్ రిజల్ట్ ఇచ్చినా.. ఈ రిజల్ట్ లో నిఖిల్ కు అనుకోని మార్కెట్ యాడ్ అయింది. ఊహించిన వారిని కూడా ఆశ్చర్యపరిచేలా.. నిఖిల్ కు బిగ్ మార్కెట్ దొరికింది. యస్.. ఈ శనివారం విడుదలైన కార్తికేయ2కు బాలీవుడ్ కూడా బ్రహ్మరథం పడుతోంది. ఇందుకు లాల్ సింగ్ కూడా ఇన్ డైరెక్ట్ గా హెల్ప్ అయ్యాడా.. లేక నిజంగానే కంటెంట్ వల్లే కలెక్షన్స్ పెరుగుతున్నాయా..?

కార్తికేయ2… 2014లో వచ్చిన కార్తికేయ సినిమాను ఇది సీక్వెల్. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ2 ఈ శనివారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ద్వాపరయుగాంతం నుంచి నేటి వరకూ ముడిపెట్టిన కథగా ఈ మూవీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్టుగా థ్రిల్స్ లేకపోయినా.. ఎడ్వెంచరస్ గా ఉండి మెప్పిస్తోంది. పైగా శ్రీ కృష్ణ జన్మస్థానం నేపథ్యంతో పాటు ఆయన కొత్త తరాలకు అందించిన విగ్నానం నేపథ్యంలో సాగే ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. దేశభక్తి కూడా మిక్స్ అయి ఉండటంతో ఇప్పుడున్న టైమ్ కూడా ప్లస్ అయిందీ చిత్రానికి.

కార్తికేయ2 ను తెలుగుతో పాటు హిందీలోనూ ప్రచారం చేశారు. అక్కడా విడుదల చేశారు. మొదట పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఈ మూవీ కంటే రెండు రోజుల ముందు విడుదలైన లాల్ సింగ్ చడ్డాకు నెగెటివ్ రివ్యూస్ రావడం కూడా కార్తికేయ2కు కలిసొచ్చింది. అందుకే షోస్ తో పాటు థియేటర్స్ కూడా పెరిగాయి. అటు సినిమాకు పాజిటివ్ టాక్ కూడా రావడంతో అక్కడి ఆడియన్స్ కు ఇది వీకెండ్ తో పాటు వీక్ డే లోనూ బెస్ట్ ఛాయిస్ గా మారింది. కంటెంట్ యూనిక్ గా ఉండటం, ఇలాంటి సినిమాలకు నార్త్ లో మంచి క్రేజ్ ఉండటంతో ఆ మార్కెట్ కార్తికేయ2కు పెద్ద ప్లస్ అయింది. మరోవైపు ప్యాన్ ఇండియన్ రేంజ్ లోనూ ఈ సినిమా వర్కవుట్ అవుతుందంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా అనుకోని ఈ మార్కెట్ నిఖిల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూ ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

, , , ,