యంగ్ హీరో నిఖిల్ మంచి స్వింగ్ లో ఉన్నాడిప్పుడు. కార్తికేయ2తో 100 కోట్లు కొల్లగొట్టి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా బాలీవుడ్ మార్కెట్ కూడా క్రియేట్ అయింది. ఈ మూవీ తర్వాత హిందీ బెల్ట్ నుంచి నిఖిల్ కు ఫ్యాన్ బేస్ కూడా స్టార్ అయిందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కంట్రీ మూడ్ ను రిసెంబుల్ చేస్తూ సాగే కథనం ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో పాటు నిఖిల్ అన్నీ తానై ప్రమోషన్స్ నుంచి రిలీజ్ వరకూ దగ్గరుండి చూసుకున్నాడు. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ హిట్ అయి ఉండటం, రెండో భాగంపై ముందు నుంచీ అంచనాలు పెంచడం వల్ల ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. మౌత్ టాక్ తో మరిన్ని థియేటర్స్ పెరగడంతో కార్తికేయ2 నిఖిల్ కు డ్రీమ్ హిట్ నిలిచింది. అయితే ఇది ఇప్పుడు అతని తర్వాతి సినిమాలపై ప్రభావం చూపిస్తోంది. నిన్నటి వరకూ తెలుగు ఆడియన్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేశాడు నిఖిల్. ఇప్పుడు హిందీ మార్కెట్ కూడా మైండ్ లో పెట్టుకోవాలి కాబట్టి కథలు కూడా అలాగే ఉండేలా చూసుకోవాల్సి వచ్చింది. అందుకే అతని లేటెస్ట్ మూవీ 18పేజెస్ ప్రస్తుతం హోల్డ్ లో పడింది. అందుకు కారణం ఖచ్చితంగా కార్తికేయ2 బ్లాక్ బస్టరే.


కార్తికేయ2 తర్వాత నిఖిల్ సినిమాల విషయంలో ఆడియన్స్ కాస్త పర్టిక్యులర్ గా ఉంటారు. మంచి ఎలిమెంట్స్ నే ఎక్స్ పెక్ట్ చేస్తారు. 18పేజెస్ మూవీ ఎప్పుడో పూర్తయింది. ఈ సెప్టెంబర్ లోనే రిలీజ్ అనే టాక్ కూడా వచ్చింది. బట్ ప్రస్తుతం ఆ టాక్ ను ఆపేశారు. అందుకు కారణం మూవీని మరింత బెటర్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ డైరక్ట్ చేశాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించింది. సూర్య ప్రతాప్.. సుకుమార్ శిష్యుడే. సినిమా చూసిన సుకుమార్ కొన్ని మార్పులు చెప్పాడట. పైగా నిఖిల్ ఇమేజ్ పెరిగింది కాబట్టి అది తోడైంది. సుకుమార్ మార్పులు చెప్పడమే కాక.. మళ్లీ కొంత భాగం రీ రైట్ చేయమని చెప్పడంతో పాటు తను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నాడట. దీంతోఈ నెలలో విడుదల కావాల్సిన 18 పేజెస్ ఆగిపోయింది. ఇప్పుడు కొత్తగా రాస్తున్నారు కాబట్టి.. ఆ రాసిందంతా మళ్లీ రీ షూట్ చేయాలి కాబట్టి.. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చెప్పడానికే టైమ్ పడుతుంది. సో.. ప్రస్తుతానికి 18 పేజెస్ లేదనే చెబుతున్నారు.

, , , , , , ,