Advertisement
కపూర్.. మధ్యలో అక్షయ్.. గెలుపెవరిదీ..?
Bollywood Latest

కపూర్.. మధ్యలో అక్షయ్.. గెలుపెవరిదీ..?

Advertisement

బాలీవుడ్ లో ఇప్పుడో వింత సిట్యుయేషన్ ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ ను కూడా సౌత్ సినిమాలే రూల్ చేస్తున్నాయి. అక్కడ వచ్చే సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అనిపించుకుంటున్నాయి. ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడాలంటే బాలీవుడ్ హీరోల్లో ఎవరో ఒకరు ఓ భారీ హిట్ ఇవ్వాలి. లేదంటే పరువు పోతుంది ఇప్పటికే అక్కడి హీరోలు, ఇతర సినీ పెద్దలు తలలు పట్టుకున్నారు. దీన్ని బయటపడేసే హీరో ఎవరా అని ప్రతి రోజూ ఎదురుచూస్తున్నారు. ఈ వెయిటింగ్ ఫుల్ స్టాప్ పెట్టేది మేమే అనేలా ముగ్గురు టాప్ స్టార్స్ బరిలోకి దిగుతున్నారు. అందులో ముందుగా వస్తోన్న హీరో షంషేర్. తన ఇమేజ్ కు భిన్నమైన ఆహార్యం, కంటెంట్ తో రణ్‌ బీర్ కపూర్ ఫస్ట్ టైమ్ చేసిన హిస్టారికల్ మూవీగా వస్తోన్న చిత్రమే ఈ షంషేర్. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనకుండా ఉండలేం. ఆ రేంజ్ లో ఉంది. ఇంకా రణ్‌ బీర్ ఫేస్ క్లియర్ గా చూపించకున్నా.. విలన్ గా సంజయ్ దత్.. ఎంత క్రూరమైన పాత్ర చేస్తున్నాడో చూపించారు. విజువల్ గా స్టన్నింగ్ అనేలా ఉందీ టీజర్. ఈ చిత్రాన్ని జూలై22న విడుదల చేస్తున్నారు. అంటే బాలీవుడ్ పరువు కాపాడతాడు అనుకుంటోన్న ఫస్ట్ హీరో ఈ రణ్‌బీర్ కపూరే అన్నమాట.

ఇక ఆ తర్వాత వస్తోన్న స్టార్ ఆమిర్ ఖాన్. ఆగస్ట్ 12న లాల్ సింగ్ చద్దా సినిమాతో వస్తున్నాడు. ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ ఇది. ఫారెస్ట్ గంప్ అక్కడ బిగ్గెస్ట్ హిట్. ఆ విజయాన్ని ఇక్కడా రిపీట్ చేసి ఈ యేడాది బాలీవుడ్ పరువు కాపాడేది ఖానే అని బాలీవుడ్ అంతా చెప్పుకుంటోన్న తరుణంలో అతనికీ ఇదో పెద్ద ఛాలెంజింగ్ అనే చెప్పాలి. మ్యారీడ్ లేడీ కరీనాకపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మన అక్కినేని బుల్లోడు నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించాడు.ఇక వీరితో పాటు వస్తోన్న మరో డిజాస్టర్ హీరో అక్షయ్ కుమార్. అక్షయ్ ఈ మధ్య ఏ సినిమా చేసినా ఫ్లాపే అన్నట్టుగా మారింది సిట్యుయేషన్. రీసెంట్ గా పృథ్వీరాజ్ అనే సినిమాతో వచ్చి పూర్తిగా భంగపడ్డాడు. మరీ దారుణమైన కలెక్షన్స్ వసూలు చేసిందీ చిత్రం. అయినా వరుసగా సినిమాలు చేస్తూ రెగ్యులర్ గా బాక్సాఫీస్ వద్ద కనిపించే అక్కీ భాయ్ కూడా మరోసారి తన లక్ ను చెక్ చేసుకునేందుకు ఈ సారి రక్షా బంధన్ అంటూ సెంటిమెంట్ అస్త్రం తీశాడు. నలుగురు చెల్లెల్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉన్న అన్న పాత్రలో కనిపిస్తున్నాడు. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. కొంత వరకూ మన చిరంజీవి హిట్లర్ చాయలు కనిపిస్తున్నా.. ఇందులో ఓ భారీ కాయురాలైన చెల్లెలు కూడా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ యాక్షన్ మూవీస్ తో ఎంటర్టైన్ చేయలేకపోయినా అక్షయ్ ఈ సారి సెంటిమెంట్ ను నమ్ముకుని అదే ఆగస్ట్ సెకండ్ వీక్ లో ఎంటర్ అవుతున్నాడు.
మొత్తంగా సౌత్ సినిమాల దండయాత్రతో షేక్ అవుతోన్న బాలీవుడ్ పరువును కాపాడేందుకు ముందు కపూర్ ఆ తర్వాత ఖాన్ అటుపై అక్షయ్ వస్తున్నారు. మరి ఈ ముగ్గురిలో బాక్సాఫీస్ ను గెలుచుకుని అక్కడి జనాలలో ఆనందాన్ని నింపే స్టార్ ఎవరో చూడాలి.

Advertisement