రివ్యూ :-కాంతార
తారాగణం :- రిషభ్ శెట్టి, సప్తమిగౌడ, కిశోర్,సంపత్, ప్రమోద్ శెట్టి తదితరులు
ఎడిటర్ :- కెఎమ్. ప్రకాష్‌, ప్రతీక్ శెట్టి
సినిమాటోగ్రఫీ :- అరవింద్ ఎస్ కశ్యప్
సంగీతం :- బి అజనీష్ లోకనాథ్
నిర్మాత :- విజయ్ కిరంగదూర్
రచన,దర్శకత్వం :- రిషభ్ శెట్టి

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రీమేక్ లు మాత్రమేఅనే ఫీలింగ్ కనిపించేది. అందుకు తగ్గట్టుగానే ఆయా భాషల్లో హిటఅయిన సినిమాలను వాళ్లు రీమేక్ చేసేవారు. అలాంటి రీమేక్స్ తోనే ఇప్పుడు టాప్ స్టార్స్ గావెలుగుతున్నారు కొందరు. బట్ మారుతున్నట్రెండ్ కు అనుగుణంగా శాండల్ వుడ్ కూడా మారింది. వైవిధ్యమైన సినిమాలతో కంట్రీ మొత్తాన్ని ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన కెజీఎఫ్ తో దేశాన్ని షేక్ చేసిన వాళ్లు.. ఇప్పుడు కాంతార అనే సినిమాతోనూ అలాగే మెస్మరైజ్ చేస్తున్నారు. చాలాకాలం తర్వాత ఒక భాషలో వచ్చిన సినిమాను మరో భాషలో డబ్ చేయాలని ప్రేక్షకులు భావించేలా చేసిన కాంతారను తెలుగులో అరవింద్ డబ్ చేసి విడుదల చేశారు. ఈ శనివారం విడుదలైన ఈ తెలుగు కాంతార ఎలా ఉందో చూద్దాం..

కథ :-
భారతదేశం రాజుల పాలనలో ఉన్నప్పుడు కన్నడ రాష్ట్రంలో పశ్చిమ కనుమల ప్రాంతంలో 17వ శతాబ్ధంలో ఓ రాజు మనశ్శాంతిని వెదుక్కుంటూ రాజ్యం అంతా తిరుగుతున్నప్పుడు అడవిలోని ఓ తెగ నివశించే ప్రాంతంలో దేవత విగ్రహాన్ని చూసి అది కావాలని కోరుకుంటాడు. దానివల్ల తనకు మనశ్శాంతి వస్తుందని అర్థిస్తాడు. అందుకు ప్రతిగా ఆ ప్రాంతాన్ని ఈ ఊరి ప్రజలకు ఇస్తే తనకు సమ్మతమే ఆ దేవతను కొలిచే గురువు చెబుతాడు. అలా గురువుతో పాటు దేవతనూ తీసుకువెళ్లిన రాజు ఆ ప్రాంతాన్ని ఊరి ప్రజలకు ఇచ్చేస్తాడు. ఎవరైనా మళ్లీ ఆ ప్రాంతాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తే గురువు ద్వారా దేవత కోపగించుకుని ఆ రాజు వంశాన్ని చంపేస్తుంది. అలా 1990ల ప్రాంతం వరకూ వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఈ తరంలో గురువు వారసుడు శివ(రిషభ్ శెట్టి).. తండ్రి బాటలో కాక ఆవారాగా పెరుగుతాడు. జులాయిగా తిరుగుతూ అడవిలో వేటాడుతూ.. వూరి రాజుగారి వారసుడైన రాజు అలియాస్ దొర దగ్గర ఉంటాడు. తన ఊరికే చెందిన ఫారెస్ట్ గార్డ్ లీల(సప్తమిగౌడ)ను ప్రేమిస్తాడు. అయితే ఆ ఊరితో పాటు వందల ఎకరాల భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తుంటారు కొందరు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించేందుకు వచ్చిన డిఎఫ్ఓ(కిశోర్)తో శివ గొడవ పెట్టుకుంటాడు. ఈ క్రమంలో శివను జైలుకు పంపిస్తాడు ఫారెస్ట్ ఆఫీసర్. శివ జైలులో ఉన్నప్పుడు అనూహ్యమైన ఘటనలు జరుగుతాయి. తన ఊరంతా ప్రమాదంలో పడుతుంది. అవేంటీ..? ఆ ప్రమాదం నుంచి శివ ఊరిని ఎలా కాపాడాడు..? చివరికి ఏమైంది అనేది కథ.

విశ్లేషణ :-
ముందుగా ఇలాంటి సినిమాతో ముందుకు వచ్చిన దర్శక హీరో రిషభ్ శెట్టిని అభినందించాలి. కొందరికి మట్టిపై ఉండే మమకారం ఎంత గొప్పగా ఉంటుందో తెలియజేసే చిత్రం ఇది. ఇక సినిమాగా చూస్తే.. కథా పరంగా కొత్తది కాకపోయినా.. కథనం, నేపథ్యం అద్భుతంగా ఉంటూ.. చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఇది కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతంలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో సాగుతుంది. కర్ణాటక ప్రజలకు సంస్కృతిలో ప్రధానమైనది యక్షగానం. జానపద గాథగా మొదలై ఇప్పుడు వారికి అత్యంత పవిత్రంగా మారింది.ఆ యక్షగానం నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. ఇది అర్థం కాకపోతే సినిమా కథ కూడా అర్థం కాదు. సో.. ఇది కన్నడిగుల జానపద కథ యక్షగాన ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ సాగుతుంది. ఆ జానపద కళకు వీరు ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది తెలుస్తుంది.17వ శతాబ్ధంలో మొదలైన కథ మొదటి అరగంట కళ్లు తిప్పుకోనివ్వదు. ఏదో అద్భుతం చూస్తున్నామా అనిపిస్తుంది. అయితే ఆ సంస్కృతిని అర్థం చేసుకుంటేనే ఈ అనుభూతి కలుగుతుంది. ఒక్కో ఘటనతో పాటు రిషభ్ శెట్టి తండ్రి పాత్ర చనిపోయిన తీరు మెస్మరైజ్ అనిపిస్తుంది.

ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోకి ఎంటర్ అవుతుంది కథ. అడవిలో వేట, ప్రేమకథ, తల్లితో తిట్లూ, దొరవారితో సావాసం.. అన్నీ కమర్షియల్ గా కనిపించే అంశాలే అయినా.. ప్రతి ఫ్రేమ్ ఓ పెయింటింగ్ లా కనిపిస్తుంది. అలా అడవుల్లో తిరుగుతున్నప్పుడు అతనికి తరచూ తన కుల దేవత కలలోకి వస్తూ.. తమ వంశానికి చెందిన గురువులు కనిపిస్తుంటారు. దానికి అర్థమేంటో తెలియక భయపడుతుంటాడు శివ. ఫస్ట్ హాఫ్ వరకూ ఎక్కడా బోర్ లేకుండా ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ముగిసిపోతుంది.శివ జైలుకు వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకూ ఊరంతా కొలిచిన శివ తమ్ముడు గురవాను కొందరు హత్య చేస్తారు. అదే రోజు రాత్రి జైలులో ఆ విషయం కల లా కనిపిస్తుంది శివకు. విషయం తెలిసి.. బెయిల్ పై బయటికి వస్తాడు. తర్వాత తమ్ముడిని చంపింది ఎవరో తెలుసుకుని తిరగబడతాడు. ఆ పోరాటంలో ఎవరు గెలిచారు అనేది సులువుగానే ఊహించొచ్చు. కానీ ఈ ప్రీ క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాదాపు అరగంట పాటు సాగే ఎపిసోడ్ ఆసాంతం ఓ అద్భుతం అనిపిస్తుంది. కనిపించేది కన్నడిగుల సంస్కృతే అయినా.. ఆ కల్చర్ నుంచి ఏ మాత్రం డీవియేట్ కాకుండా అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు రిషభ్ శెట్టి.

కాంతార సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్ టెక్నికల్ టీమ్. కెజీఎఫ్ లాంటి సినిమా తీసిన నిర్మాత రూపొందించిన సినిమా కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయి. ఈ సినిమాకు ఇద్దరు ఎడిటర్స్ పనిచేశారు. దర్శకుడు రిషభ్ శెట్టి ఆలోచనను అద్భుతంగా ఆవిష్కరించారు. అతని షాట్ డివిజన్ ను, టేకింగ్ ను బాగా అర్థం చేసుకున్నారు. పాటలు మరీ అంత గొప్పగా లేవు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఇక సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ రెండు అంశాలే సినిమాను అన్ని భాషల్లో నిలబెడతాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక దర్శకుడుగా రిషభ్ శెట్టి గురించి చెప్పుకోవాలి. కన్నడ సినిమా పరిశ్రమలో టెక్నికల్ గా బ్రిలియంట్ అనదగ్గర నటుడు, దర్శకుడు అతను. ప్రతి సినిమాలోనూ తనదైన సంస్కృతికి పెద్ద పీట వేస్తుంటాడు. ప్రధానంగా యక్షగానంపై అతనికి ఎంత మక్కువో ఒక్కో సినిమాలో కనిపిస్తుంది. తన గత సినిమా గరుడగమన వృషభ వాహన లోనూ ఈ తరహా సీన్స్ క స్పేస్ ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో తన సంస్కృతిని అత్యంత బలంగా, కమర్షియ యాక్సెప్టన్సీ ఉండేలా.. అద్భుతమైన టేకింగ్ తో తన సంస్కృతి తెలియని ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని చూడాలి అని బలంగా కోరుకునేలా చేయగలిగాడు అంటే కారణం.. వెరీ సింపుల్.. ఈ కథను అతను ఎంత ప్రేమించాడో.. అంత నిజాయితీగా చెప్పాడు. సింపుల్ గా చెబితే కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ ఈ కాంతార.

ఫైనల్ :- కాంతార.. మస్ట్ వాచ్ మూవీ

        - 3.5/5
            - యశ్వంత్ బాబు. కె
, , , , , ,