లోక నాయకుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్థత తో చెన్నై లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆయన జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నాయి. కమల్ సమస్య చిన్నదే అయినా .. ఈ మధ్య వరుసగా సంభవిస్తున్న ఘటనల నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇక కమల్ హాసన్ రీసెంట్ గానే తను గురు సమానులుగా భావించే కే విశ్వనాధ్ కలిసి వెళ్లారు. అంతకు ముందు చాల ఏళ్ళ తర్వాత విక్రమ్ మూవీ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం భారతీయుడు మూవీ కి సీక్వెల్ చేస్తున్నారు.


గతంలో కమల్ హాసన్ రెండు సార్లు కొవిడ్ బారిన పది కోలుకున్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య కూడా దాని తాలూకు ఎఫెక్ట్ అనుకుంటున్నారు. ఏదేమైనా లోక నాయకుడు వీలైనంత త్వరగా కోలుకుని మల్లి సెట్స్ లో అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

, , , , , ,