Advertisement
స్టార్ హీరోల‌తో సినిమా టెన్ష‌న్ అంటున్న జ‌క్క‌న్న‌
Latest Movies Trending News

స్టార్ హీరోల‌తో సినిమా టెన్ష‌న్ అంటున్న జ‌క్క‌న్న‌

Advertisement

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటి చెప్పి.. బాలీవుడ్ మాత్ర‌మే కాదు.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు. అయితే.. రాజ‌మౌళి యంగ్ స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తున్నారు కానీ.. సీనియ‌ర్ స్టార్ హీరోల‌తో సినిమాలు చేయ‌డం లేదు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్.. రాజ‌మౌళితో సినిమా చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ గానే ఉన్నారు కానీ.. రాజ‌మౌళి మాత్రం సీనియ‌ర్ హీరోల‌తో సినిమా చేయ‌డం లేదు.

కార‌ణం ఏంటి..? తాజాగా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ టాక్ షోలో రాజమౌళికి ఇదే ప్రశ్న ఎదురైంది. పెద్ద హీరోలతో సినిమాలు చేయడమంటే తనకి చాలా టెన్షన్ అని నవ్వేస్తూనే ఆయన అసలు విషయాన్ని దాటేశారు. రాజ‌మౌళి ఏంటి…? సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి టెన్షన్ ప‌డ‌డం ఏంటి..? అని చాలా మంది ఆశర్యపోక మానరు. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. ఆయన అనుకున్నప్పుడు మొదలుపెట్టి.. అనుకున్నప్పుడే పూర్తి చేయవచ్చు కానీ.. రాజమౌళి మాత్రం సీనియర్ హీరోలతో సినిమాలు అంటే టెన్షన్ అవుతుందని అంటున్నారు.

టెన్షన్ అనే దానికంటే .. ఇబ్బంది అని చెప్ప‌చ్చు. రాజమౌళి తనతో సినిమాలు చేసే హీరోలు తనకి అందుబాటులో ఉండాలనీ .. తనతోనే ట్రావెల్ కావాలని కోరుకుంటారు. తనతో పాటు తన హీరోలు కూడా అంతే శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్టు పై పని చేయాలని కోరుకుంటారు. త్వరగా మా షాట్స్ తీసి మమ్మల్ని పంపించేయండి అంటే ఆయన దగ్గర కుదరదు. వాళ్లు అలా అన‌క‌పోయినా.. రాజ‌మౌళి వాళ్ల‌ను వెయిట్ చేయించ‌లేరు. అందుక‌నే సీనియ‌ర్ హీరోల‌తో రాజ‌మౌళి సినిమాలు చేయ‌డం లేదు. అదీ.. సంగ‌తి.

Advertisement