Advertisement
విజయదశమి రోజున శంఖం మ్రోగించనున్న జై బాలయ్య
Latest Movies Tollywood

విజయదశమి రోజున శంఖం మ్రోగించనున్న జై బాలయ్య

Advertisement

బాలకృష్ణ అంటే అభిమానుల్లో ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉందో.. ఇప్పుడు తరాలు మారినా అదే క్రేజ్ ఉంది. ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ లో మార్పులు వచ్చాయి. కొత్తతరం వచ్చింది. అయినా బాలయ్య సినిమాల్లో కనిపించే దబిడి దిబిడికి ఎప్పుడూ అభిమానులున్నారు. ముఖ్యంగా మాస్ కు బాలయ్య సినిమా అంటే పండగే. అందుకే ఇప్పటికీ తన తరం హీరోల్లో బెన్ ఫిట్ షోస్ విషయంలో క్రేజీగా ఉన్న ఏకైక హీరోగా నిలిచాడు బాలకృష్ణ. కాకపోతే విజయాలు మాత్రం ఎప్పట్లానే స్థిరంగా ఉండవు ఆయనకు. రాకరాక ఓ బ్లాక్ బస్టర్ పడిందా.. ఇంక ఆ తర్వాత వరుసగా ఫ్లాపులూ వస్తాయి. కానీ ఇవన్నీ మర్చిపోయేలాగా మరో బిగ్గెస్ట్ హిట్ కొడతాడు. ఆ కొట్టడంలో ఈ మధ్య ఆయనకు బోయపాటి సపోర్ట్ బాగా ఉంటోంది. రీసెంట్ గా వచ్చిన అఖండ బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ ఫ్లాపులు తప్పవా అనుకుంటోన్న వారికి ఈ సారి ట్రెండ్ బ్రేక్ అవుతుంది అనేలా క్రాక్ తో తనలాగానే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో జత కట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడే అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ సారి బాలయ్య ‘‘మళ్లీ’’ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని.
బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోన్న ఈచిత్రంలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీకి ‘‘జై బాలయ్య’’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూ మంచి స్పందన వచ్చింది. ఇక మరో విశేషం ఏంటంటే.. బాలకృష్ణకు ‘‘విగ్’’ కరెక్ట్ గా సెట్ అయితే ఆ సినిమా గ్యారెంటీగా సూపర్ హిట్ అవుతుంది. ఈ మూవీకీ విగ్ కుదిరింది. ఇక సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన టైమ్ ను బట్టి అంతా ఈ చిత్రం వచ్చే యేడాది విడుదలవుతుందనుకున్నారు. కానీ సూపర్ ఫాస్ట్ గా ఫినిష్ చేసి.. ఈ దసరాకే విడుదల చేయబోతున్నారు.
యస్.. జై బాలయ్య చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయబోతున్నారు. అంటే దసరా టైమ్ అన్నమాట. మామూలుగానే బాలయ్య సినిమా ఎప్పుడు వచ్చినా ఫ్యాన్స్ కు పండగే. ఇంక పండగ టైమ్ లోనే వస్తే చెప్పేముందీ.. దసరాకు థియేటర్స్ అన్నీ దబిడి దిబిడే అనుకోవచ్చు.

Advertisement

Post Comment