Advertisement
జబర్దస్త్ కామెడియన్లు హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ చెంప చెళ్లు
Latest Movies Tollywood

జబర్దస్త్ కామెడియన్లు హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ చెంప చెళ్లు

Advertisement

జబర్దస్త్ కామెడియన్లు హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే రోజా, అవాక్కయిన ఇతరులు

`జబర్దస్త్` రోజా అంటే ఫైర్‌ బ్రాండ్‌. రెబల్‌ యాటిట్యూడ్‌కి మారుపేరు. అలాంటి రోజాకి ఎదురుతిరిగితే ఇక అంతే. తాజాగా జబర్దస్త్ కమెడీయన్లు హైపర్‌ ఆది, బుల్లెట్‌ భాస్కర్‌ల చెంప చెళ్లుమనిపించింది ఎమ్మెల్యే రోజా. దీంతో ఇప్పుడిది సంచలనంగా మారింది.

ఎంత అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే మాత్రం అందరి ముందు కొడుతుంది. పైగా టీవీ షోస్‌లో కమెడీయన్లగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్‌ ఆది, బుల్లెట్‌ భాస్కర్‌ల చెంప చెళ్లుమనిపిస్తుందా? ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. మరి సంచలనంగా మారిన ఈ సన్నివేశంలో తప్పెవరిది, బుల్లెట్‌ భాస్కర్‌, హైపర్‌ ఆదిలను రోజా అందరి ముందు ఎందుకు కొట్టిందనేది తెలుసుకుందాం.

ఈటీవీలో పండుగలకు స్పెషల్‌ ఈవెంట్లు చేస్తుంటారు. ఇటీవల హోళీ సందర్భంగా కూడా ఈవెంట్లు చేశారు. త్వరలో ఉగాది పండుగ రాబోతుంది. ఈ సందర్భంగా ఈటీవీ.. మల్లెమాల ఆధ్వర్యంలో `అంగరంగ వైభవంగా` అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేసింది. ఇది ఏప్రిల్‌ 2న ప్రసారం కానుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో స్టేజ్‌పై హైపర్‌ ఆది, బుల్లెట్‌ భాస్కర్‌లను రోజా కొట్టడం హైలైట్‌గా నిలుస్తుంది.

ఈ షోలో హీరో రాజశేఖర్‌, జీవిత, యాంకర్ సుమ, శ్రీముఖి, రష్మి, జబర్దస్త్ టీమ్‌, సీనియర్‌ నటీమణులు అన్నపూర్ణమ్మ వంటి వారు పాల్గొన్నారు. అయితే ఇందులో ఉగాది పంచడి తయారు చేయడం కోసం ఏం చేయాలనే దానిపై చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో ఆది పంచ్‌ల, యాంకర్‌ ప్రదీప్‌ సెటైర్లు, దానికి రోజా, సుమ, ఇతర గెస్ట్ లు కౌంటర్లతో ఆద్యంతం నవ్వులు పూయించింది.

అయితే ఇందులో మరోసారి పెళ్లి ప్రోగ్రామ్‌ పెట్టుకున్నారు. ఈ సారి జబర్దస్త్ బ్యాచ్‌ కాకుండా టీవీ నటులు నిరుపమ్‌, ఆయన భార్యకి పెళ్లి చేశారు. ఎప్పటిలాగే మ్యారేజ్‌ తంతుని హంగామా చేశారు. ఇది స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అప్పటి వరకు ఆద్యంతం నవ్వులు పూయిస్తూ సాగిందీ `అంగరంగ వైభవంగా` షో.

అంతలోనే ఒక్కసారిగా హీటెక్కింది. `జబర్దస్త్` జడ్జ్, ఎమ్మెల్యే రోజా హైపర్‌ ఆది, బుల్లెట్‌ భాస్కర్‌ని స్టేజ్‌పైనే కొట్టడంతో ఒక్కసారిగా షో సీరియస్‌ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇంతకి ఏం జరిగిందంటే. `మీరు మాకు ఇవ్వకపోతే అక్కడేం చేస్తారని ప్రశ్నించాడు భాస్కర్‌. దీంతో గట్టిగా రియాక్ట్ అయిన రోజా.. నువ్వు .. బీప్‌.. గురించి మాట్లాడకు అని అనడంతో, నేను బరాబర్‌ అంటా మేడమ్‌ అని రియాక్ట్ అయ్యాడు భాస్కర్‌. దీంతో చెంప చెళ్లు మనిపించింది రోజా.

దీంతో అంతా షాక్‌ అయ్యారు. నోరెళ్ల బెట్టారు. మధ్యలో కల్పించుకుని ఒక ఆర్టిస్ట్ మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదని హైపర్‌ ఆది.. రోజాని ఉద్దేశించి అన్నాడు. దీంతో మళ్లీ మండిపోయిన రోజా.. ఆది చెంపపై కూడా గట్టిగా వేసింది. దీంతో షో మొత్తం ఒక్కసారిగా అవాక్కయ్యింది. అంతా షాక్‌ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. రోజా ఫస్ట్ టైమ్‌ ఇలా సీరియస్‌ కావడంతో హీటెక్కిపోయింది. మరి ఏం జరిగిందనేది ఆసక్తి నెలకొంది.

అయితే దీనిపై నెటిజన్లు మాత్రం ఫైర్‌ అవుతున్నారు. ఇది కూడా ఫ్రాంక్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మళ్లీ ఫ్రాంక్‌ స్టార్ట్ చేశార్రా బాబోయ్‌ అంటూ, టీఆర్‌పీ కోసం డ్రామాలంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఫ్రాంక్‌లతో మోసం చేస్తారని మండిపడుతున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే ఏప్రిల్‌ 2 వరకు ఆగాల్సిందే. కానీ ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

Advertisement