ప్లానింగ్ పక్కాగా ఉంటేనే సినిమాలు ఆలస్యం అవుతుంటాయి. అలాంటిది వేసుకున్న ప్లానింగ్ లో షెడ్యూల్స్ సెట్ చేసుకోలేకపోతే ఇంక ప్రాజెక్ట్ లు ఎంత ఆలస్యం అవుతాయో కొత్తగా చెప్పక్కర్లేదు. మీడియం రేంజ్ హీరోల విషయంలో అయితే ఫర్వాలేదు కానీ స్టార్ హీరోలకూ ఇలా జరిగితే వారి ఆగ్రహానికి గురికాక తప్పదు. లేటెస్ట్ గా విజయ్ కి ఇదే అనుభవం ఎదురైంది. అతను ఫస్ట్ టైమ్ చేస్తోన్న తెలుగు దర్శకుడు, నిర్మాత సినిమా వారసుడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ ప్లానింగ్ బెడిసికొట్టిందట. దీంతో దర్శకుడితో పాటు నిర్మాణ సంస్థపైనా విజయ్ కాస్త గుర్రుగా ఉన్నాడని టాక్. అయితే విజయ్ కోపం విడుదల విషయంలో కాదు.. తన డేట్స్ విషయంలో.

ఈ మూవీ కోసం అతను మూడు నెలల పాటు డేట్స్ ఇచ్చాడు. కానీ ఇప్పటికే నాలుగు నెలలు పాటు చిత్రీకరించారు. అంటే 90 రోజులు అనుకున్న షూటింగ్ 120 రోజులైంది. అయినా ఇంకా పూర్తి కాలేదట. ఇంకా కొన్ని రోజుల పాటు చిత్రీకరణ చేయాల్సి ఉందట. దీంతో విజయ్ దర్శకుడిపైనే ఎక్కువ కోపంగా ఉన్నాడంటున్నారు.మామూలుగా వంశీ పైడిపల్లి కూడా రాజమౌళిలాగా చెక్కుడు టైప్. ఓ పట్టాన దేన్నీ ఓకే చేయడు అంటారు. విజయ్ కి అలా కాదు.. తను చేసిందే టేక్ అన్నట్టుగా ఉంటాడు అతను. అందుకే తన సినిమాలు చాలా వేగంగా పూర్తవుతాయి. పైగా అతనికి ఇప్పుడు రెడీగా ఇద్దరు దర్శకులున్నారు.

వారిలో లోకేష్‌ కనకరాజ్ ఒకడు. అలాంటి వాడిని వెయిటింగ్ లో పెట్టడం అంటే ఓ బ్లాక్ బస్టర్ ను వెయిటింగ్ లో పెట్టినట్టే అని ఎవరైనా భావిస్తారు. అందుకే వారసుడు ఆలస్యం పై విజయ్ అసంతృప్తితో ఉన్నాడంటున్నారు.ఇక మరో విషయం ఏంటంటే.. ఈ ఆలస్యం వల్ల వారసుడు సంక్రాంతి బరిలో నిలవడం కూడా కష్టమే అని భావిస్తున్నారు. కానీ ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు దిల్ రాజు అలెర్ట్ అవుతాడు. కిందా మీదా పడి అయినా సరే సినిమాలను పూర్తి చేసి అనుకున్న టైమ్ కు ఆడియన్స్ ముందుకుతెచ్చేందుకు శ్రమిస్తాడు. ఈ వారసుడు విషయంలోనూ అలాగే తనే స్వయంగా రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది. ఏదేమైనా హీరోలను బట్టే షూటింగ్ లు ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ రావేమో.

, , , , ,