కొందరికి టైమ్ భలే కలిసొస్తుంది. అలాగని అదే పనిగా కలిసిరాదు. బట్ వస్తుందేమో అన్న ఆశ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఎవరూ ఊహించని విధంగా కన్నడలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న కాంతార సినిమాను తెలుగులో డబ్ చేసి చాలా లాభాలు చూశాడు నిర్మాత అల్లు అరవింద్.

నిజానికి అరవింద్ ప్రిడిక్ట్ చేసి డబ్ చేసి రిలీజ్ చేసిన సినిమాల్లో దాదాపు 80శాతం సక్సెస్ లే ఉన్నాయి. కాంతారతో మెగాస్టార్ గాడ్ ఫాదర్ కు షాక్ ఇచ్చిన అరవింద్ లేటెస్ట్ గా మరో డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకున్నాడు.

ఇది కూడా కాంతారలాగా లాభాలు తెస్తుందనుకుంటే.. ఆదిలోనే అతనికి షాక్ ఇస్తోంది. మామూలుగా ఈ మధ్య హిందీ నుంచి డబ్ అయిన సినిమాలేవీ మనవాళ్లను ఆకట్టుకోలేదు. భారీగా ప్రమోషన్ చేసిన సినిమాలు కూడా డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. అలాంటి టైమ్ లో అల్లు అరవింద్ కాంతార ఇన్సిస్పిరేషన్ తో మరో సినిమాగా భేడియాను తెస్తున్నాడు. అంటే తోడేలు.

తోడేలు పేరుతోనే తెలుగులో విడుదల చేస్తున్నారు. వరుణ్ ధావన్, క్రుతిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకుడు. తెలుగులో అల్లు అరవింద్ డబ్ చేసి విడుదల చేస్తున్నాడు. అయితే వరుణ్ ధావన్ తెలుగులో ఎలాంటి గుర్తింపూ లేకపోవడం ఫస్ట్ మైనస్ గా మారింది.

అందుకే ఈ మూవీ గురించి తెలుగులో ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అసలుకే ఎసరు వస్తుందనుకున్నారో ఏమో.. ఇంత పెద్ద భారీ చిత్రాన్ని ఫ్రీగా చూసే అవకాశం కల్పించారు తెలుగు అనువాద నిర్మాతలు.


ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే సినిమా తీసినంత ప్రహసనంగా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఎంతో క్రియేటివ్ గా ఆలోచిస్తే తప్ప ప్రేక్షకులు ఒక సినిమా గురించి ఆలోచించడం లేదు. ఈ క్రమంలో వారిని ఆకట్టుకునేందుకు ఈ ఫ్రీ టికెట్ ను అనౌన్స్ చేశాడు అరవింద్.

అందులో భాగంగా ఎవరైనా 175రూపాయలు పెట్టి బుక్ బై షోలో టికెట్ కొంటే.. టికెట్ కన్ఫార్మ్ అవుతుంది.. ఆ తర్వాత వారి అకౌంట్ లోకి 350 రూపాయలు పడిపోతాయి. అంటే పూర్తిగా ఈ టికెట్ ఉచితంగా పొందుతారన్నమాట.

మరీ ఫ్రీ అంటే పరువు పోతుందనుకున్నారో లేక ఇంకేదైనా రీజన్ ఉందో కానీ.. ఈ ఆఫర్ ను ఈ నెల 20 వరకూ బుక్ చేసుకున్న వారికి మాత్రమే పరిమితం చేశారు. అన్నట్టు సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. మరి కాంతార విజయాన్ని ఈ ఫ్రీ టికెట్ ప్రమోషన్ కంటిన్యూ చేస్తుందా లేక.. ఆ సక్సెస్ షేర్ ను మింగేస్తుందా అనేది చూడాలి.

, ,