చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రమోషన్స్ లో వెనకబడితే కలెక్షన్స్ లో సైతం వెనకబడినట్టే. పైగా కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడు కంటెంట్ ఎంత బలంగా ఉన్నా.. దాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడానికి రిలీజ్ కు చాలా రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ఆడియన్స్ లో ఆ మూవీ నాటుకుపోతుంది. లేదంటే బాక్సాఫీస్ బరిలో తేలిపోతుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్ లో సంక్రాంతి వార్ పైనే అందరి దృష్టీ ఉంది. ఆ మేరకు ఆల్రెడీ రిలీజ్ కాబోతోన్న సినిమాల డేట్స్ కూడా వచ్చాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు జనవరి 12న వస్తున్నాయి. ఆ నెక్ట్స్ డే మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య ఉంది. అయితే బాలయ్యతో పోలిస్తే మిగతా రెండు సినిమాలకు సంబంధించిన సందడి అస్సలు కనిపించడం లేదు.


చిరంజీవి వాల్తేర్ వీరయ్య నుంచి ఆ మధ్య వచ్చిన బాస్ పార్టీ సాంగ్ ఒకట్రెండు రోజుల్లోనే వెనకబడిపోయింది. ఇటు బాలయ్య జై బాలయ్య సాంగ్ పరిస్థితీ అలానే ఉన్నా.. ఆయన రోజు ఏదో ఒక ఈవెంట్ కు అటెండ్ అవుతూ వీరసింహారెడ్డిని లైవ్ లో ఉంచుతున్నాడు. ఈ విషయంలో చిరంజీవి చాలా వెనకబడిపోయి ఉన్నాడనే చెప్పాలి. నిజం చెప్పాలంటే ఇప్పుడీ మూవీకి పెద్దగా బజ్ కూడా లేదు. రవితేజ కూడా ఉన్నాడు అని చెబుతున్నా..ఆ రేంజ్ క్రేజ్ ఏ మాత్రం కనిపించడం లేదు. కేవలం రిలీజ్ ముందు మాత్రమే సందడి చేస్తే ఇలాంటివి వర్కవుట్ కావు. చాలా రోజుల ముందు నుంచే జనాలను ప్రిపేర్ చేయాలి. అంచనాలు పెంచాలి. అప్పుడు వాటిని అందుకునేంత కంటెంట్ ఉంటే ఆశించినదానికంటే డబుల్ కలెక్షన్స్ వస్తాయి.. అలా కాక కేవలం కంటెంట్ ను మాత్రమే నమ్ముకుంటే ఇవాళా రేపు కలెక్షన్స్ రావు అని చాలా సినిమాలు నిరూపిస్తున్నాయి.


ఇక విజయ్ కి తెలుగులో పెద్ద మార్కెట్ లేదు. కేవలం దిల్ రాజు నిర్మిస్తున్నాడు.. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి చేశాడు అనే అంశాలు తప్ప అతనికి ఇక్కడ మన హీరోలను ఢీ కొట్టేంత మార్కెట్ లేదు. అయినా స్ట్రెయిట్ మూవీ అని వీళ్లూ.. డబ్బింగ్ మూవీ అని వాళ్లూ చెబుతున్నారు కాబట్టి.. ఇక్కడ ప్రమోషన్స్ లో జోరు పెంచాలి. విజయ్ తో ఎక్కువ మార్కెటింగ్ చేయించగలగాలి. ఇప్పటి వరకూ విజయ్ తన సినిమాలకు సంబంధించి తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. బట్ ఈ సారి అవసరం. లేదంటే నిండా మునిగేది రాజుగారే. ఏదేమైనా భారీ సినిమాలు వస్తున్నాయంటే ప్రమోషన్స్ పరంగానూ ఆ సినిమాల మధ్య పోటీ ఉండాలి. కానీ ఇక్కడ అలాంటిదేం కనిపించడం లేదు.

, , , , , , , , , , , ,