Advertisement
ఇండ‌స్ట్రీ పెద్ద‌గా వ‌ర్మ‌నా..? ఏం సెప్తిరి డైరెక్టర్ గారు
Movies Tollywood

ఇండ‌స్ట్రీ పెద్ద‌గా వ‌ర్మ‌నా..? ఏం సెప్తిరి డైరెక్టర్ గారు

Advertisement

ఇండస్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే పెద్ద చ‌ర్చ జ‌రుగుతుంది. ద‌ర్శ‌క‌ర‌త్న దాసరి నారాయ‌ణ‌రావు ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆ లోటు అలాగే ఉంది. అయితే.. చిరంజీవి ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఉండాల‌ని గ‌త కొంత కాలంగా ఆయ‌న్ని కొంత మంది అడ‌గ‌డం.. మ‌రి కొంత మంది ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు అంటూ ఎవ‌రూ లేరు అని కామెంట్ చేయ‌డం వివాద‌స్ప‌దం అయ్యింది. అయితే.. చిరు బాగా హ‌ర్ట్ అయ్యార‌నుకుంటా.. ఇండస్ట్రీ పెద్దగా ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదని.. బాధ్యత గల ఒక బిడ్డగా మాత్రమే ఉంటానని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ బాధ్యతలను తన గురువుకు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు అప్పగించాలి అంటున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అజ‌య్ భూప‌తి.. రామ్ గోపాల్ వ‌ర్మ‌కు శిష్యుడు. త‌న గురువును ఇండ‌స్ట్రీ పెద్ద‌గా చూడాలి అనుకుంటున్నాను అంటూ త‌న మ‌న‌సులో కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు అజ‌య్. ట్విట్ట‌ర్ లో అజ‌య్ భూప‌తి స్పందిస్తూ.. మా బాస్ ( రాంగోపాల్ వర్మ) ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక. సామీ మీరు రావాలి సామీ అని పేర్కొన్నారు.

అజ‌య్ కామెంట్ కి నెటిజ‌న్లు అనూహ్యంగా స్పందిస్తున్నారు. నిజంగానే అజ‌య్.. ఈ ట్వీట్ వేశారో.. లేక ఫ‌న్నీగా వేశారో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ‌రి.. వ‌ర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisement