ad

బాహుబ‌లి సినిమాతో చ‌రిత్ర సృష్టించిన‌ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన భారీ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌భాస్, పూజా హేగ్డే జంట‌గా న‌టించిన ఈ క్రేజీ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు యు.వి. క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ భారీ, క్రేజీ ప్రేమ‌క‌థా చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌వ‌న‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. క‌రోనా కార‌ణంగా మ‌ళ్లీ రాధేశ్యామ్ వాయిదా ప‌డుతుంది అని వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. మేక‌ర్స్ మాత్రం పండ‌గ‌కి రావ‌డం ఖాయం అని చెబుతున్నారు.

 

ఇదిలా ఉంటే.. రాధేశ్యామ్ ఓటీటీలో రిలీజ్ కానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కార‌ణం ఏంటంటే.. రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతానికి ప్ర‌మోష‌న్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. దీంతో రాధేశ్యామ్ వాయిదా ప‌డ‌డం ఖాయం అనేది గ‌ట్టిగా వినిపిస్తోంది. ఇలా రాధేశ్యామ్ గురించి వార్త‌లు వ‌స్తుండ‌డంతో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు రాధేశ్యామ్ మేక‌ర్స్ కి భారీ ఆఫ‌ర్ ఇచ్చార‌ని తెలిసింది. ఏంటా ఆఫ‌ర్ అంటే.. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తే.. 400 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఇస్తామ‌నేది ఆ ఆఫ‌ర్.

ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌లేదు కానీ.. సినిమాను మాత్రం థియేట‌ర్లోనే రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమాని థియేట‌ర్లో రిలీజ్ త‌ర్వాత‌ ఓటిటిలో రిలీజ్ చేసేందుకు స్త్రీమింగ్ పార్ట్నర్ గా జీ 5 వారు క‌న్ ఫ‌ర్మ్ అయ్యారు. అందుచేత డైరెక్ట్ గా వేరే ఓటీటీలో రిలీజ్ చేయ‌లేరు. థియేట‌ర్లోనే రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడు అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ప్ర‌క‌టించిన‌ట్టుగా జ‌న‌వ‌రి 14నే రిలీజ్ చేస్తారా..? లేక వాయిదా వేస్తే.. ఎప్పుడు రిలీజ్ చేస్తారు..? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

, , , , , , , , , , , , , , , , ,