మిక్సుడ్ టాక్ తో సూపర్ సక్సెస్ అయిన సినిమా పుష్ప. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప, హిందీ మార్కెట్లో ఎవ్వరూ ఊహించనివిధంగా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఏమాత్రం ప్రమోషన్స్ లేకుండా బాలీవుడ్లో వంద కోట్ల నెట్ వసూళ్ళు సాధించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే పుష్ప పార్ట్2ని..ఫస్ట్ పార్ట్ కి మించేలా తెరకెక్కించబోతున్నారు మేకర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప భారీ విజయాన్ని అందుకుంది.”పుష్ప సూపర్ హిట్ సినిమా”

నిజానికి తెలుగులో మామూలు విజయమే అయినా…హిందీలో మాత్రం భారీ విజయాన్ని సాధించింది. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయకుండా అక్కడ వంద కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్లో పుష్ప సక్సెస్ అక్కడి స్టార్స్ ని, మేకర్స్ కి కూడా షాక్ ఇచ్చింది.

పుష్ప ఫస్ట్ పార్ట్ సాధించిన విజయం వల్ల…మేకర్స్ ఇప్పుడు సెకండ్ పార్ట్ ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి, ఇదే ఏడాది డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎందుకంటే పుష్ప కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే రిలీజైంది.”పుష్ప సూపర్ హిట్ సినిమా”

ఇక అంచనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి… సుకుమార్ మరింతగా కథ, కథనంతో పాటు పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. మైత్రీ మూవీస్ సంస్థ కూడా భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉంది.

, , , , , , , ,