నిజమేనా… ధనుష్‌ అంత పని చేశారా? అని అవాక్కవుతున్నారు నిర్మాతలు. హీరో చేసిన పనికి నిర్మాతలు అంతలా షాక్‌ అయ్యారంటే, మేటర్‌ మనీ గురించేనని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు కదా. తమిళ హీరో ధనుష్‌ రెమ్యునరేషన్‌ గురించి ఇప్పుడు కోలీవుడ్‌ మొత్తం కోడై కూస్తోంది. మొన్న మొన్నటి వరకు 20 కోట్లు తీసుకుంటున్న ధనుష్‌ ఇప్పుడు ఏకంగా ఇంకో పది పెంచేశారన్నది వైరల్‌ అవుతున్న వార్త.
సినిమా హిట్‌ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ధనుష్‌. రీసెంట్‌గా ఆయన హాలీవుడ్‌ సినిమా రిలీజై బెస్ట్ రిజల్ట్స్‌ని రాబట్టింది.

దానికి తోడు తెలుగు, తమిళ్‌లో విడుదలైన తిరుకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన దగ్గర పెద్దగా లేదు కానీ, తమిళంలో తిరు మంచి హిట్‌ అయింది. ఆ సినిమాలో అంత మంది హీరోయిన్లున్నా నిత్యామీనన్‌కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. తిరు రిజల్ట్ చూసిన తర్వాత ధనుష్‌ రెమ్యునరేషన్‌ పెంచేశారట. నా సినిమాలు వంద కోట్లకు తక్కువకాకుండా వసూలు చేస్తున్నాయి. నేను హాలీవుడ్‌, బాలీవుడ్‌లో కూడా ఫేమస్‌. అలాంటప్పుడు నాకు 30 కోట్లు ఇస్తే తప్పేముంది? అని అంటున్నారట ఈ హీరో.

ఈయన కథానాయకుడిగా ప్రస్తుతం సార్‌ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత కూడా వరుసగా డైరక్టర్లు క్యూలో ఉన్నారు. ఓ వైపు నిర్మాతగా, గాయకుడిగా, డైరక్టర్‌గా, లిరిసిస్ట్ గా పేరు తెచ్చుకుంటున్నారు ధనుష్‌.ధనుష్‌ నటించిన నానే వరువేన్‌ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తెలుగులో హిట్‌ డైరక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ సినిమాకు ఆల్రెడీ ఓకే చెప్పారు ధనుష్‌. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే ఆ సినిమా గురించి ఆలోచిస్తారన్నది టాక్‌.

, , , , , ,