ad

ప్యాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. కానీ ఆ స్టార్డమ్ ను నిలబెట్టుకునేలా ఈ మధ్య చేసిన రెండు సినిమాలూ కనిపించలేదు. ముఖ్యంగా రాధేశ్యామ్ బాగా నిరాశపరిచింది. కానీ ప్రభాస్ అందుకు ప్రిపేర్ అయ్యే ఉన్నాడు అనిపించింది చాలామంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న సలార్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రశాంత్ డైరెక్ట్ చేసిన కెజీఎఫ్2 రిలీజ్ అయింది. రికార్డులు కొడుతోంది. సో.. ఇక సలార్ అప్డేట్ గురించి ఆలోచిస్తోన్న టైమ్ లో ఈ మూవీ టీజర్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తోంది.
ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ఆ హీరో లేదా దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దాని ఎఫెక్ట్ పడుతుంది. మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే ఫీలింగ్ ఇస్తుందీ విజయం. ఇప్పుడు కెజీఎఫ్ చాప్టర్2 కూడా సూపర్ హిట్ అనిపించుకుంది కాబట్టి.. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే సినిమాలపైనా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో ఓ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ఆల్రెడీ ఉన్న ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి.. అంచనాలు భారీగానే ఉంటాయి. వాటిని అందుకుంటారా లేదా అనేది ఇప్పుడే అక్కర్లేదు కానీ.. ముందు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటీ అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

కెజీఎఫ్2కు సంబంధించిన వ్యవహారం పూర్తయింది కాబట్టి.. ఇక తర్వాతి ప్రాజెక్ట్ పై కాన్ సెంట్రేట్ చేస్తున్నాడు ప్రశాంత్. ఆల్రెడీ ఈ చిత్రాన్ని జూలై 29న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఇక సమ్మర్ లో ఆ సినిమా సందడి కూడా మొదలవుతుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు కదా..? అందుకే ఈ సలార్ మూవీ టీజర్ ను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ టైమ్ లో వచ్చే సినిమాలు ప్రమోషన్స్ లో బిజీగా ఉంటాయి. ఇటు వీళ్లు రాబోయే తమ సలార్ టీజర్ తో ఆడియన్స్ అటెన్సన్ ను తమవైపు తిప్పుకుంటారన్నమాట. అయితే టీజర్ చూస్తే చాలు.. ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందనేది అంచనా వేయొచ్చు. మరి నిజంగానే మే ఫస్ట్ వీక్ లో సలార్ టీజర్ ఇస్తారా లేదా అనేది చూడాలి.

, , , , , ,