Advertisement
ఆర్ఆర్ఆర్ ర‌న్ టైమ్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్
Bollywood Latest Movies Regional Tollywood

ఆర్ఆర్ఆర్ ర‌న్ టైమ్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

Advertisement

ఆర్ఆర్ఆర్.. ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్న సినిమా ఇది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా టీజర్లు, పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన జనని పాట జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అది ఏంటంటే.. ఈ మూవీ ర‌న్ టైమ్. ఈ సినిమా ర‌న్ టైమ్ మూడు గంట‌ల‌కు పైగా ఉంద‌ట‌. ఇంకా చెప్పాలంటే.. ఈ మూవీ నిడివి మూడు గంటల పది నిమిషాలు ఉండ‌నుంద‌ని తెలుస్తుంది. ఇప్పటికే రన్ టైంను ఎంత తగ్గించినా 3 గంటలకు మించి తగ్గించలేక పోతున్నారట. దాంతో చివరకు 3 గంటల 10 నిమిషాలు వుంచాలి అనుకుంటున్నార‌ట‌. అయితే.. మూడు గంట‌ల ప‌ది నిమిషాలు అంటే ప్రేక్షకులు అంత ఓపికగా సినిమా చూస్తారా.? అనేది డౌట్. రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ బాలయ్య అఖండ సినిమా రన్ టైమ్ కూడా దాదాపుగా మూడు గంటలు ఉంది.

అలాగే మమ్ముట్టి నటించిన మరక్కార్ కూడా మూడు గంటల వరకు ఉంది. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమా మూడు గంట‌ల ప‌ది నిమిషాలు ఉన్న‌ప్ప‌టికీ ప్రేక్షకులు ఓపికగా చూస్తారని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. అయితే.. 3 గంట‌ల 10 నిమిషాలు ఉంచుతారో.. లాస్ట్ మినిట్ లో ఆలోచ‌న మార్చుకుని త‌గ్గిస్తారో చూడాలి.

Advertisement