సంగీత దిగ్గజం ఇళయరాజా, జంట ఆస్కార్ల వీరుడు రెహమాన్‌… ఇద్దరూ ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. అందులో ఒకరిది ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌ విషయం కాగా, మరొకరిది ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో మారుమోగిపోయే టాపిక్‌. హంగేరిలో మ్యూజిక్‌ షో ఏర్పాటు చేశారు ఇళయరాజా. అక్కడికి వెళ్లాలంటే దుబాయ్‌ ఫ్లైట్‌ని క్యాచ్‌ చేయాలి. చెన్నై మీనంబాక్కం ఎయిర్‌పోర్టుకి తెల్లారుజామున 2 గంటలకే చేరుకున్నారు. అయితే రాత్రంతా వర్షం పడటంతో ఫ్లైట్‌ మూడు గంటలు డిలే అయింది. ఆ తర్వాత రన్‌వే మీద నీళ్లు రావడంతో ఇంకో మూడు గంటలు డిలే. ఆలస్యం అయిన ఫ్లైట్‌ బయలుదేరడానికి మరో రెండు గంటలు. టోటల్‌గా ఇసైజ్ఞాని ఏడు గంటల పాటు మీనంబాక్కం ఎయిర్‌పోర్టులో స్ట్రక్‌ అయ్యారు. ఆయన్ని గమనించిన ప్రయాణికులు ఆయనతో ముచ్చటిస్తూ కనిపించారు.

పలువురు ఫ్యాన్స్ ఆయనతో తీసుకున్న ఫొటోలు, ఆయన ఎయిర్‌పోర్టులో వెయిట్‌చేయడానికి రీజన్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇళయరాజా నేమ్‌ ఇన్‌స్టంట్ గా వైరల్‌ అయింది.మరోవైపు అంతే స్పీడుగా రెహమాన్‌ పేరు కూడా నెట్టింట్లో వినిపించింది. ఆస్కార్‌ వీరుడు రెహమాన్‌ పేరు ఇప్పుడు కెనడాలో మరోసారి వైరల్‌ అవుతోంది. అక్కడి మార్కెట్‌ ఏరియాలో ఒక స్ట్రీట్‌కి ఆల్రెడీ రెహమాన్‌ పేరు పెట్టారు. 2013లో అక్కడి అఫీషియల్స్ ఈ ప్రపోజల్‌ని ఓకే చేశారు. ఇప్పుడు లేటెస్ట్‌గా సేమ్‌ ఏరియాలోని ఇంకో స్ట్రీట్‌కి కూడా ఆయన పేరు పెట్టారు. ఎట్‌ ప్రెజెంట్‌ కోబ్రా, పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించే పనుల్లో బిజీగా ఉన్నారు రెహమాన్‌.

, , , ,