ఎంత సిల్లీ రూమర్ వచ్చినా.. కొంతమంది నిప్పులేకుండా పొగ రాదు కదా అని భావిస్తుంటారు. కొన్నిసార్లు నిప్పే కాదు.. అసలు ఏమీ లేకుండానే రూమర్స్ వస్తుంటాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించి ఇవి విపరీతంగా వినిపిస్తుంటాయి. సినిమా వాళ్లంటే ఉండే అలుసుకొద్దీ చాలా వరకూ నమ్మేస్తుంటారు కూడా. లేటెస్ట్ గా అలాంటి ఓ నమ్మశక్యం కాని రూమర్ గంటల్లోనే వైరల్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన సినిమా షూటింగ్ ఆగిపోయిందనేదే ఆ గాసిప్స్ సారాంశం. దీనికి వాళ్లు దట్టించిన మసాలా ఏంటీ అంటే ఫైట్ మాస్టర్స్ తో మహేష్‌ బాబుకు పొసగలేదు. అందుకే వారిని మార్చేయమన్నాడు. ఆ కారణంగా రీసెంట్ గానే స్టార్ట్ అయిన షూటింగ్ ఆగిపోయిందీ అని. బట్ ఇది నిజం కాదు.

ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ లుగా ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ కాస్ట్ లీ అనిపించుకున్న అన్బు అరివ్ ఇద్దరూ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. కబాలి, 24, సింగం3, కెజీఎఫ్, విక్రమ్ లాంటి భారీ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండియాలోని టాప్ పెయిర్ స్టంట్ మాస్టర్స్ లో వీరూ ఉన్నారు. అలాంటి వీరి నేతృత్వంలో రీసెంట్ గా యాక్షన్ సీక్వెన్స్ తోనే రామోజీ ఫిల్మ్ సిటీలో త్రివిక్రమ్- మహేష్‌ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంతలోనే ఈ రూమర్ క్రియేట్ చేశారు కొందరు. దీంతో మూవీ టీమ్ నుంచి అఫీషియల్ గా ఓ న్యూస్ వచ్చింది. విశేషం ఏంటంటే..

ఈ రూమర్ వల్ల ఫ్యాన్స్ కు ఓ అప్డేట్ తెలిసింది. అదేంటంటే.. ఈ మూవీ ఏకంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్ కు వెళ్లబోతోంది. ఒకవేళ ఇంత స్పీడ్ గా మొదటి షెడ్యూల్ ఫినిష్ కావడం వల్ల కొందరు అపోహ పడి ఆగిపోయిందీ అనుకున్నారేమో కానీ.. మొత్తంగా షెడ్యూలే పూర్తయిందనేది అసలు విషయం.మహేష్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ త్రివిక్రమ్ – మహేష్‌ కాంబోలో పన్నెండేళ్ల తర్వాత వస్తోంది. అంతకు ముందు అతడు, ఖలేజా వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు. 2023 ఏప్రిల్ 28న విడుదల చేస్తాం అని గతంలోనే అనౌన్స్ చేశారు. ఆ మేరకే షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు అనుకోవచ్చు.3

, , , , , , ,