Advertisement
అలా జరిగితే పెళ్లి చేసుకుంటా – నాగశౌర్య
Latest Movies Tollywood

అలా జరిగితే పెళ్లి చేసుకుంటా – నాగశౌర్య

Advertisement

లాక్ డౌన్ లో పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఇబ్బంది పెట్టారని, మరోసారి లాక్ డౌన్ గనుక వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అన్నారు హీరో నాగశౌర్య. తన కొత్త సినిమా లక్ష్య కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ యంగ్ హీరో…అరుదుగా ఇలాంటి కథలు వస్తాయని అందుకే చాలా ప్రిపేర్ అయ్యి సినిమా చేశానని చెప్పారు నాగశౌర్య. లక్ష్య సినిమా గురించి తన కెరీర్ గురించి నాగశౌర్య చెప్పిన విశేషాలు చూస్తే…

నాగశౌర్య మాట్లాడుతూ..లక్ష్య కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని అనుకున్నాను. కొత్త నాగ శౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశాను. ఆర్చరీ మనకు తెలియంది కాదు. పురాణాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం.. మన వీరుల చేతుల్లో విల్లు ఉంటుంది. ఈ రోజు విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లోనూ రామ్ చరణ్ గారు బాణంతో కనిపించారు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే అందరం చాలా కష్టపడతాం. ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోలేదు. వరుడు కావలెను సినిమా తరువాత సంబంధాలేవీ రాలేదు. గత లాక్డౌన్‌లోనే పెళ్లి పెళ్లి అంటూ ఇంట్లో చంపేశారు. ఇంకోసారి లాక్డౌన్ వస్తే పెళ్లి చేసుకుంటాను. అలా అని లాక్డౌన్ రావాలని కోరుకోవడం లేదు. ఐరా ప్రొడక్షన్స్ నెంబర్ 4లో ఓ సినిమాను చేస్తున్నాను. ఇందులో బ్రాహ్మిణ్ కారెక్టర్‌ను పోషిస్తున్నాను. అన్నారు.

Advertisement