Advertisement
అత‌నికి ముందు నేనే ప్ర‌పోజ్ చేశాను – శృతిహాస‌న్
Latest Movies Tollywood

అత‌నికి ముందు నేనే ప్ర‌పోజ్ చేశాను – శృతిహాస‌న్

Advertisement

అన‌గ‌న‌గా ఓ థీరుడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన క‌మ‌ల్ కూతురు శృతి హాస‌న్. అయితే.. ఈ సినిమా ఆశించినంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఆత‌ర్వాత న‌టించిన ఓ మై ఫ్రెండ్ మూవీ కూడా అంతే. దీంతో ఈ అమ్మ‌డుకు ఆశించినంత‌గా అవ‌కాశాలు రాలేదు. అలాంటి టైమ్ లో గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది. ఆ సినిమా స‌క్స‌స్ అవ్వ‌డంతో శృతి కెరీర్ ట‌ర్న్ అయ్యింది.

అయితే.. ఈ అమ్మ‌డు ల‌వ్ లో ప‌డి.. సినిమాల పై కాన్ స‌న్ ట్రేష‌న్ చేయ‌క‌పోవ‌డంతో కెరీర్ వెన‌క‌బ‌డింది. మ‌ళ్లీ ఇప్పుడు ఫామ్ లోకి వ‌చ్చింది. వ‌కీల్ సాబ్ సినిమాలో న‌టించింది. స‌క్స‌స్ అవ్వ‌డంతో వ‌రుస‌గా అవ‌కాశాలు అందిపుచ్చుకుంటుంది. స‌లార్ లో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్ శాంతన్ హాజరికాని అభిమానులకు పరిచయం చేసింది.

తాజాగా వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో క్వీజ్‌లో పాల్గొన్నారు ఈ కపుల్. ఇన్‌స్టాగ్రామ్‌లో క్వీజ్‌లో ఈ కపుల్ పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. అందులో ఈ బ్యూటీనే మొదట శాంతనుకి ఐ లవ్ యూ అని చెప్పినట్లు తెలిపింది. అంతే కాకుండా.. ఇద్దరిలో ఎవరు బాగా ప్రొటెక్టివ్‌గా ఉంటారని అడగగా.. వారిద్దరూ ఒకరినొకరు చూపించుకున్నారు. వీళ్లిద్దరూ గత రెండు సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నట్లు శృతినే గ‌త సంవ‌త్స‌రం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మ‌రి.. పెళ్లి ఎప్పుడు చూసుకుంటార‌నేది మాత్రం చెప్ప‌లేదు.

Advertisement