Advertisement
అంటే.. సుంద‌రానికి సినిమా పై నానికి శ్ర‌ద్ద త‌గ్గిందా..?
Latest Movies Tollywood

అంటే.. సుంద‌రానికి సినిమా పై నానికి శ్ర‌ద్ద త‌గ్గిందా..?

Advertisement

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చేయ‌నున్న సినిమా అంటూ నాని తన కెరీర్ లో 28వ సినిమాగా ‘అంటే.. సుందరానికీ!” అనే ఆసక్తికర టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు.

అలాగే కొత్త దర్శకుడితో దసరా అనే మూవీని ఇటీవ‌ల‌ ప్రకటించారు. ”అంటే.. సుందరానికీ!” సినిమాకి బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – రవిశంకర్ వై. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ మొదలైనట్లు మేకర్స్ ప్రకటించారు.

అలాగే నాని చాలా ఎగ్జైటింగ్ గా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్ప‌డం జ‌రిగింది కానీ.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ప్ర‌స్తుతం నాని ఫోకస్ అంతా శ్యామ్ సింగ‌రాయ్ పైనే ఉంది. ఇటీవ‌ల అనౌన్స్ చేసిన ద‌స‌రా మూవీకి సంబంధించి అప్ డేట్స్ వ‌స్తున్నాయి కానీ.. అంటే సుంద‌రానికీ.. సినిమాకి సంబంధించి ఎలాంటి వార్త‌లు రావ‌డం లేదు. దీంతో నాని ఈ సినిమాని లైట్ తీసుకున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం వ‌స్తున్న వార్త‌ల నేప‌ధ్యంలో అయినా నాని అంటే.. సుంద‌రానికీ సినిమా పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Advertisement