Advertisement
నేనేంటో నాకు తెలుసు, మీరు పొగిడితే పొంగిపోను – డైరెక్టర్ మారుతి
Latest Movies Tollywood

నేనేంటో నాకు తెలుసు, మీరు పొగిడితే పొంగిపోను – డైరెక్టర్ మారుతి

Advertisement

ఆహా ఓటీటీ కోసం మారుతి చేసిన త్రీ రోజెస్ వెబ్ సిరీస్ సక్సెస్ అయ్యింది. అలాగే ఆయన దర్శకత్వం వహించిన మంచి రోజులు వచ్చాయి సినిమా ఇటీవలే స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సినిమానూ బాగానే చూస్తున్నారు. ఈ రెండు సక్సెస్ ల నేపథ్యంలో సెలబ్రేటింగ్ మాస్ ఎంటర్ టైనర్ మారుతితి కార్యక్రమాన్ని నిర్వహించి మారుతిని పొగిడారు ఆహా టీమ్. ఆహా టీమ్ పొగడ్తలకు పొంగిపోనని స్టేజీ మీదే చెప్పిన మారుతి….నేనేంటో నాకు తెలుసు అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.

ఇంకా మారుతి ఏం మాట్లాడంటే…నా కోసం మాస్ ఎంటర్ టైనర్ అనే ప్రోగ్రాం పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. కానీ నేనేంటో నేనేం చేయగలనో ఎప్పుడూ మర్చిపోను. ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అఖండ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. రాబోయో సినిమాలకు కూడా ఇదే ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. మంచి రోజులు వచ్చాయి సినిమా దీపావళి టైమ్ లో రిలీజ్ చేసినప్పుడు థియేటర్ ఎక్సీపిరియన్స్ కోరుకున్న వాళ్లు థియేటర్ కు వెళ్లారు ఓటీటీ కోసం వేచి చూసేవారు ఆగారు. ఇప్పుడు ఆహాలో మంచి రోజులు వచ్చాయి స్ట్రీమింగ్ మొదలవగానే చూడని వాళ్లంతా చూస్తున్నారు. నెక్ట్ ఇయర్ ఇంకో ప్రోగ్రాం ఆహాకు చేస్తాను. అన్నారు.

Advertisement