ad

సీతారామం.. క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకున్న సినిమా. దుల్కర్ కు తెలుగులో క్రేజ్ ఉన్నా.. భారీ ఓపెనింగ్స్ తెచ్చేంత ఇంకా రాలేదనే చెప్పాలి. అందుకే సినిమాపై ముందు నుంచీ భారీ హైప్ ఉన్నా.. కలెక్షన్స్ ఆ రేంజ్ లో లేవనే చెప్పాలి. బట్ మౌత్ టాక్ తో ఈ సినిమా వీకెండ్ కు సూపర్ హిట్ గా డిక్లేర్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగని మొదటి కలెక్షన్స్ వీక్ అని కాదు. స్ట్రాంగ్ గానే ఉన్నాయి. సినిమాకు అయిన బిజినెస్ తో పోలిస్తే సీతారామం విజయం గ్యారెంటీ అని తెలిసిపోతుంది.

హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి రోజు మూడు కోట్ల వరకూ షేర్ వసూలు చేసి సత్తా చాటింది. ఈ సినిమాను టోటల్ గా 12కోట్ల థియేట్రికల్ రైట్స్ కు అమ్మేశారు. ఆ మేరకు ఇప్పుడు టాక్ ను బట్టి చూస్తే ఈ సినిమా వీకెండ్ కు బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. పైగా రిపీటెడ్ ఆడియన్‌స్ కూడా పెరుగుతున్నారు.నిజానికి ఇలాంటి సినిమాలు స్లో పాయిజన్ లానే ఉంటాయి. మెల్లగా ఎక్కుతాయి. టాక్ అద్భుతంగా ఉంది కాబట్టి.. ఖచ్చితంగా సీతారామం కలెక్షన్స్ పరంగానూ ఓ బెంచ్ మార్క్ సెట్ చేస్తుందనే అనుకుంటున్నారంతా. అటు ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. సో.. ఈ వారం విడుదలైన రెండు సినిమాలూ బాక్సాఫీస్ నూ గెలుచుకున్నట్టుగానే చెప్పాలి.

, , , , ,