హిట్.. వాల్ పోస్టర్ బ్యానర్ పతాకంపై నేచురల్ స్టార్ నాని నిర్మించిన సినిమా. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీకి డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. హిట్ అనే మాటకు అప్పట్లో అందరికీ అర్థం సరిగా తెలీలేదు. హిట్ అంటే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనే పోలీస్ డిపార్ట్ మెంట్ లోని ఓ విభాగం పేరుకు సంక్షిప్త రూపం. సినిమా టైటిల్ గానూ బాగా కుదరడంతో పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ఇక ఫస్ట్ పార్ట్ తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని అప్పట్లోనే అనౌన్స్ చేశారు. అయితే ఒకే తరహా కథల్లో నటించను అని చెప్పి విశ్వక్ సేన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.

కానీ ఈ తరహా కథలతోనే దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న అడవి శేష్‌ ప్రాజెక్ట్ లోకి వచ్చాడు. దీంతో ఇప్పుడీ మూవీకి మరింత వెయిట్ పెరిగింది. మరోసారి శైలేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రీసెంట్ గానే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే కొన్ని ప్యాచ్ వర్క్ లు ఉన్నాయి.


ఈ ప్యాచ్ వర్క్ ల షూట్ కోసం టైమ్ ఇవ్వలేకపోయాడు శేష్‌. అందుకు కారణం అతని రీసెంట్ మూవీ మేజర్. ఈ మూవీ విడుదల టైమ్ లో ప్రమోషన్స్ తో పాటు ఇతర వ్యవహారాలు తన స్వయంగా చూసుకోవడంతో బాగా అలసిపోయానని అందుకే హిట్2 షూటింగ్ కు కొంత టైమ్ కావాలని ఓపెన్ గానే లెటర్ పెట్టాడు శేష్‌. అందుకు నాని అండ్ టీమ్ ఒప్పుకుంది. మరి త్వరలోనే షూట్ స్టార్ట్ చేసి ఫినిష్‌ చేస్తారు కాబట్టి.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.


అక్టోబర్ నెల దాదాపు రిలీజ్ డేట్స్ తో ప్యాక్ అయింది. నవంబర్ లో మంచి టైమ్ లేదు అనుకున్నారో లేక పోస్ట్ ప్రొడక్షన్ కు టైమ్ పడుతుందో కానీ ఈ హిట్ 2 చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మర్డర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో మొదటి భాగం రూపొందింది. ఇది కూడా అంతే ఉండొచ్చు. అయితే ఈ సారి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయంటున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

, , , , , , , , ,