Advertisement
సైనా నెహ్వ‌ల్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన హీరో సిద్ధార్థ్
Latest Movies Tollywood

సైనా నెహ్వ‌ల్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన హీరో సిద్ధార్థ్

Advertisement

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలు వివాద‌స్పదం అయిన విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం అయ్యింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. భార‌త ప్ర‌ధాని మోదీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ పై దాడికి యత్నించడం పిరికి పంద చర్య. ఈ ఘటనను తాను ఖండిస్తున్నానని సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది.

అయితే.. సైనా ట్వీట్‌పై స్పందించిన హీరో సిద్ధార్థ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌పై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విమర్శలు చేశారు. అంతే కాకుండా.. జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు పంపింది. ఈ వివాదం రోజురోజుకు మ‌రింత పెద్ద‌దిగా అవుతుండ‌డంతో ఇక లాభం లేద‌నుకుని సిద్ధార్థ్ సైనా నెహ్వ‌ల్ కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ లేఖ రాశాడు.

నేను ట్వీట్ ద్వారా చేసిన రూడ్ జోక్‌కి మన్నించాలని అన్నాడు. తన ఉద్దేశ్యంలో ఎలాంటి తప్పు లేకున్నా కొందరు దానిని తప్పుగా చూపి నా మీద విమర్శలు చేశారని, మహిళలు అంటే తనకు ఎంతో గౌరవమని, నా ట్వీట్‌లో జెండర్‌కు సంబంధించిన విషయాలేవీ లేవని సిద్ధార్థ్ అన్నాడు. క్షమాపణలు చెబుతున్నాను సైనా అంటూ విజ్ఞప్తి చేశాడు. అంతే కాదు.. నువ్వు ఎప్పుడూ ఛాంపియన్‌గా ఉంటావు సైనా అంటూ సిద్ధార్థ్ లేఖలో పేర్కొన్నాడు.

Advertisement