Advertisement
మరో వివాదంలో హీరో సల్మాన్
Latest Movies Tollywood

మరో వివాదంలో హీరో సల్మాన్

Advertisement

బాలీవుడు హీరో సల్మాన్ ఖాన్ పై మరో కేసు నమోదైంది. ఇప్పటికే కృష్ణ జింకను వేటాడిన కేసు వెంటాడుతుంటే తాజాగా మరో కేసులో ఇరుక్కున్నాడీ కండల వీరుడు. తాజా సమాచారం ప్రకారం… సల్మాన్ ఖాన్, అతడి బాడీగార్డ్ నవాజ్ షేక్ తనతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా తన ఫోన్ లాక్కొని దాడి చేశారని అశోక్ పాండే అనే జర్నలిస్ట్ 2019లో ముంబైలో కేసు దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన అంథేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ హీరో సల్మాన్ కు, అతడి బాడీగార్డ్ నవాజ్ షేక్ కు సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 5న కోర్టుకు రావాలని ఈ సమన్లలో పేర్కొన్నారు.

కాగా 2019, ఏప్రిల్ 24న ముంబైలో ఈ సంఘటన జరిగింది. సల్మాన్ ఖాన్, అతడి బాడీగార్డ్ నవాజ్ షేక్ లిద్దరూ ముంబై వీధుల్లో సైకిల్ రైడింగ్ చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని తన కెమెరాలో రికార్డ్ చేసేందుకు జర్నలిస్ట్ అశోక్ పాండే ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన సల్మాన్, అతడి బాడీగార్డ్ తనపై దాడి చేశారని అశోక్ పాండే కోర్టుకు తెలిపాడు. అందుకు సంబంధించిన సాక్షాలను కూడా కోర్టుకు అందించాడు. అయితే రికార్డ్ చేసేందుకు అంతకు ముందు సల్మాన్ అనుమతి తీసుకున్నట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో సల్మాన్ పై కేసు దాఖలు చేశాడు.

Advertisement