ఒకప్పుడు కథలు రాసుకుని హీరోలను ఎంచుకునేవారు. ఇప్పుడు హీరోలున ఎంచుకుని కథలు రాస్తున్నారు. ఇంకొందరైతే.. తమకు సూట్ కాని కథల్లోనూ సూట్ అయ్యేలా ట్రాన్స్ ఫర్ అయ్యి మరీ మెప్పిస్తున్నారు. ఏం చేసినా ఇప్పుడు ప్రేక్షకుల్లోనే కాదు.. మేకర్స్ లోనూ చాలా చాలా మార్పులు వచ్చాయి. ఏదైనా కథ విషయంలో కాంప్రమైజ్ కావడానికి చాలామంది సిద్ధంగా లేరు. ముఖ్యంగా రాయడం కూడా తెలిసినవారు.

ఏదైనా సినిమా స్టార్ట్ కావడానికి ముందే అంతా సిద్ధం చేసుకోవాలనుకుంటున్నారు. ఒక్కోసారి కొందరు హీరోలు మధ్యలోనూ కల్పించుకుని మార్పులు చేయడానికీ వెనకాడ్డం లేదు. ఇదంతా మేకింగ్ ప్రాసెస్ లో భాగమే అనుకుంటున్నారు కూడా. బట్ సీనియర్స్ లో ఆ సిస్టమ్ ఇంకా అలవాటు కాలేదు. మొదట ఓకే చెప్పిన తర్వాత ఇక అంతా దర్శకుడికే వదిలేస్తున్నారు. ఇందుకు యువతరం సిద్దంగా లేదు. ఈ రెండు కారణాలూ ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్, విశ్వక్ సేన్ ల సినిమా కాంట్రవర్శీలో కనిపిస్తాయి.


విశ్వక్ కు కమిట్మెంట్ లేదు అనేది అర్జున్ వెర్షన్. ” మా టైమ్ లో మేం ఎలా ఉన్నాం” అంటున్నాడు. షూటింగ్ రోజు అర్థరాత్రి దాటాక నేను రావడం లేదు అని మెసేజ్ చేశాడు అన్నాడు అర్జున్.అది నిజమే.. కానీ నేను ఒక్క రోజు టైమ్ కావాలని మాత్రమే కదా అడిగాను.. ఏమైనా మార్పులు, సమస్యలు ఉంటే సరి చేసుకుని బరిలోకి దిగాలనే ఉద్దేశ్యమే నాది తప్ప అందులో మరేం లేదు అనేది విశ్వక్ మాట.

అలాగే విశ్వక్ మరో విషయం చెప్పాడు. షూటింగ్ కు వెళ్లే రోజున నేను భయం భయంగా వెళ్లాల్సిన అవసరం రాకూడదు. అర్జున్ సినిమా విషయంలో అలా అనిపించింది. ఆ భయాన్ని తొలగించుకునే అవకాశం కోసమే ఒక్క రోజు ఆగాలని చెప్పాను అన్నాడు. ఇందులో నిజాయితీ ఉంటే విశ్వక్ సేన్ వాదన కరెక్టే.


అయితే ఇక్కడ అర్జున్ ది ఆవేదన అయితే.. విశ్వక్ ది కాస్త ఎక్కువ రియాక్షన్. రెండూ సినిమాకు మేలు చేయవు. కలిసి మాట్లాడుకునే అవకాశం ఉన్నా.. పబ్లిక్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు అర్జున్. ఖచ్చితంగా ఇది అంత వరకూ రావాల్సిన అంశం కాదు. ఎందుకంటే షూటింగ్ మొదలయ్యి.. ఒకటీ రెండు షెడ్యూల్స్ తర్వాత హీరో ఇబ్బంది పెడితే అందుకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది.. డైరెక్టర్స్ యూనియన్ ఉంది. అందులో మాట్లాడుకోవచ్చు. కానీ ఒకే రోజు ఆలస్యానికి అర్జున్ ఎలాగూ తనే నిర్మాత కాబట్టి హీరోను తీసివేసి అతనికి కమిట్మెంట్ లేదు అని చెప్పడం అంత సబబుగా లేదు. కౌన్సిల్ లో మాట్లాడిన తర్వాత కూడా అతని ప్రవర్తన మారకపోతే ఇలా చేయొచ్చు. బట్ ఇదొక ఆప్షన్. అర్జున్ ఆప్షన్ తీసుకోలేదు. డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టాడు.

ఇక విశ్వక్ సేన్.. వేరే వారి ప్రెస్ మీట్ కు గెస్ట్ గా వెళ్లినా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇచ్చాడు. అతని వెర్షన్ కూడా క్లియర్ గానే ఉంది. నేను చెప్పినప్పుడు రూమ్ లో కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ కూడా లేడు. కేవలం ఇద్దరమే ఉన్నాం అన్నాడు. అంటే నేను హుందాగా ప్రవర్తించాను కానీ అర్జున్ కాదు అని ఇన్ డైరెక్ట్ గానే చెప్పినట్టు. ఏదేమైనా ఒక నిర్మాతను ఇబ్బంది పెట్టడం.. నిర్మాత కూడా అయిన విశ్వక్ సేన్ కు కరెక్ట్ కాదు. అలాగే ఓ సీనియర్ స్టార్ గా చిన్న అంశానికే పెద్దగా బ్లేమ్ చేయడం అర్జున్ కూ కరెక్ట్ కాదు.
సో.. ఈ ఇద్దరి విషయంలో తప్పెవరిదీ అని కాకుండా వేలెత్తి చూపించుకునేదాకా తెచ్చుకున్నది ఎవరు అని మాత్రమే డిసైడ్ చేయగలం.

, , , , , , , , , , , , ,