ఏ ఇండస్ట్రీ చూసినా ఇప్పుడు వారసులదే హవా. అలాగని ఇది తప్పు అనడం లేదు. టాలెంట్ ఉన్నళ్లో నిలబడతారు. లేదంటే ఆడియన్స్ లైట్ తీసుకుంటే రెండు మూడు సినిమాలకు అవుట్ అయిపోతారు. శుభమా అంటూ కుర్రడు ఎంట్రీ ఇస్తుంటేఈ మాటలు ఎందుకు అంటారా అయితే ఇప్పుడు మనం బెల్లంకొండ గణేష్‌ దూకుడు గురించే మాట్లాడుకుందాం. సురేష్‌ మొదటి కొడుకు శ్రీనివాస్ మాస్ హీరోగా నిలబడేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఇప్పుడు ఛత్రపతిని హిందీలో రీమేక్ చేశాడు. మరోవైపు అతని తమ్ముడు గణేష్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

పైగా ఇతన్ని ప్రామిసింగ్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ లాంచ్ చేస్తోంది. స్వాతిముత్యం అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో గణేష్‌ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అయితే ఇంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చాడు గణేష్‌ బాబు.
స్వాతిముత్యం తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ గురించి చెబుతారు అనుకుంటే ముందే మరో మూవీతో వస్తున్నాడు గణేష్. యస్.. “నేను స్టూడెంట్ ను సర్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో గణేష్‌ హీరోగా మరో సినిమా రాబోతోంది. ఈ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ చాలా ఇంప్రెసివ్ గా ఉందనే చెప్పాలి. గణేష్‌ అమాయకంగా మొహం పెట్టి, తన ఐ.డి కార్డ్ ను చూపిస్తూ.. టైటిల్ డైలాగ్ నే చెబుతున్నట్టుగా ఉంట అతని చుట్టూ పదుల సంఖ్యలో తుపాకులు పట్టుకుని పోలీస్ లు ఉన్నారు. అంటే ఏదైనా చేయని తప్పుకు ఓ విద్యార్థిని బలి చేయబోతోన్న పోలీస్ వ్యవస్థపై మరో సెటైర్ లా ఉంది. విశేషం ఏంటంటే ఈ బ్యానర్ ఇంతకు ముందు నాంది సినిమాను రూపొందించింది. అది కూడా ఇలా చేయని తప్పుకు బలైన యువకుడి కథే. మరి ఈ సారి ఎలాంటి కంటెంట్ తో వస్తున్నారో కానీ గణేష్ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. హీరో, మాస్ హీరో అనే హడావిడీ లేకుండా ఇలాంటి మంచి కథలు చెబుతూ నటుడుగా రాణించగలిగితే కొంత కాలం పాటు ఇండస్ట్రీలో నిలవొచ్చు.

, , , , ,