ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య పెద్దగా ఆకట్టుకోలేదు. అంచనాలు భారీగా ఉన్నా.. రిజల్ట్ రివర్స్ అయింది. అయినా శంకర్ తో చేస్తోన్న సినిమాతో మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడు అనుకున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ అన్నిటి సారాంశం ఏంటంటే.. సినిమా ఆగిపోయిందని.. యస్.. చరణ్‌- శంకర్ సినిమా ప్రస్తుతానికి అటకెక్కిందంటున్నారు. మరి అందుకు కారణాలేంటీ..? ఇది పూర్తిగా ఆగిందా లేక ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారా అనేది చూద్దాం..

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌ స్పాన్ చాలా పెరిగింది. ఆ స్పాన్ ను శంకర్ సినిమా నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళుతుందని అంతా భావించారు. అందుకే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడే అంచనాలు పెరిగాయి. ఇక శంకర్ సినిమా అంటే విజువల్ గ్రాండీయర్. చిన్న పాటకు కూడా మీడియం రేంజ్ సినిమా బడ్జెట్ అంత ఖర్చుపెడతాడు. అలాంటి శంకర్ ను కూడా కంట్రోల్ చేయగల నిర్మాత దిల్ రాజు ఉండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ క్రేజ్ వచ్చింది. చరణ్ సరసన కియార అద్వానీని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆల్రెడీ వీరి కాంబోలో వినయవిధేయ రామ వచ్చింది. అటు కియారాకు బాలీవుడ్ లో మంచి ఇమేజ్ వచ్చింది. మొత్తంగా ఎలా చూసినా ఓ ప్యాన్ ఇండియన్ మూవీకి కావాల్సిన అన్ని హంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు మెగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నాయి.

రామ్ చరణ్ తో సినిమా ప్రారంభించడానికి ముందే శంకర్ భారతీయుడు2ను ప్రారంభించాడు. ఓ షెడ్యూల్ కూడా జరిగింది. ఆ తర్వాత కొన్ని సెట్స్ లో అగ్ని ప్రమాదం జరగడం.. కథ విషయంలో గొడవలు రావడం వంటి అంశాలతో మేటర్ కోర్ట్ వరకూ వెళ్లింది. దీంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ గ్యాప్ లో చరణ్ తో సినిమా ఫినిష్ చేయాలనుకున్నాడు శంకర్. చకచకా ప్రారంభించాడు కూడా. కానీ ఇక్కడే మళ్లీ సీన్ రివర్స్ అయింది. ముందు కమిట్ అయిన భారతీయుడు2ను ముందు పూర్తి చేయాలని ఆ నిర్మాతలు కోర్ట్ మెట్లెక్కారు. శంకర్ రెండు సినిమాలనూ సైమల్టేనియస్ గా చేస్తాడు అన్నారు. అందుకు ఆ నిర్మాతలు ఒప్పుకోలేదు. దీంతో చేసేందేం లేక చరణ్‌ సినిమాను ప్రస్తుతానికి ఆపేసి ముందుగా భారతీయుడు2ను పూర్తి చేయబోతున్నాడట. మరి ఇప్పుడు దిల్ రాజు రియాక్షన్ ఏంటో చూడాలి.

, , , , , , ,