ad

ఎలిమెంట్స్ లేని సినిమా మసాలా లేని చికెన్ కర్రీలా ఉంటుంది. అలాగని మాస్ ఎలిమెంట్స్ లేనివి మంచి సినిమాలు కాదు అని చెప్పడం లేదు. బట్.. మాస్ అంటే మనోళ్లకు ఓ రేంజ్ లో ఇష్టం. అలాంటి మాస్ మూవీస్ కు బాస్ అనిపించుకున్న దర్శకులు తక్కువే. ఆ తక్కువలోనే ఊరమాస్ అనిపించుకున్నాడు బోయపాటి శ్రీను. శ్రీనుతో సినిమా అంటే మాటలు కాదు.. అనేలా చేసిన బోయపాటి బర్త్ డే ఇవాళ.

బోయపాటి శ్రీను వచ్చిన స్కూల్ కు తీస్తోన్న సినిమాలకు అస్సలు సంబంధం లేదు. గుంటూరు జిల్లా పెద కాకానిలో పుట్టిన అతను సినిమా రంగంపై ఇంట్రస్ట్ తో హైదరాబాద్ చేరాడు. దగ్గర చుట్టం పోసాని రికమెండేషన్ తో ముత్యాల సుబ్బయ్య వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. సుబ్బయ్య సినిమాలు సెంటిమెంట్ తో నడుస్తాయి. కొన్నాళ్ల తర్వాత దిల్ రాజు దర్శకుడుగా అవకాశం ఇచ్చాడు. రవితేజ హీరోగా నటించిన భద్రతో దర్శకుడుగా బ్లాక్ బస్టర్ కొట్టి పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు బోయపాటి.
భద్ర బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ ను ఊరమాస్ గా చూపిస్తూ తీసిన తులసి కూడా మంచి విజయమే సాధించింది. బోయపాటిలోని ఫైర్ ను బయటకు తెచ్చింది మాత్రం సింహా. అప్పటికి వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యతో చేసిన సింహా అఖండ విజయం సాధించి.. బాలయ్యతోనే అఖండ వంటి సినిమా వరకూ రావడానికి కారణమైంది. అటుపై వీరి కాంబోలోనే వచ్చిన రెండో సినిమా లెజెండ్ తో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. లెజెండ్ కు ముందు యంగ్ టైగర్ తో చేసిన దమ్ము బాక్సాఫీస్ వద్ద టైటిల్ కార్డ్ ను చూపించలేకపోయింది.
తోటి హీరోలంతా వంద కోట్ల క్లబ్ అంటూ హడావిడీ చేస్తోంటే.. ఆ క్లబ్ లో చేరలేక ఇబ్బంది పడుతోన్న అల్లు అర్జున్ హండ్రెడ్ క్రోర్ క్లబ్ లో చేరడానికి సరైనోడే అని నిరూపించింది బోయపాటి శ్రీనే. సరైనోడులో బలమైన కంటెంట్ లేకపోయినా.. బలమైన ఫైట్స్ తో పాటు తనదైన టేకింగ్ తో బ్లాక్ బస్టర్ గా నిలిపాడు బోయపాటి. ఓ రకంగా యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు హీరోఎలివేషన్ షాట్స్ ను డివిజన్ చేయడంలో ఈ తరంలో బోయపాటి తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదేమో.
కొత్తగా వచ్చిన కుర్రాడిని కూడా తనదైన శైలిలోనే ఊరమాస్ మూవీస్ తో జానకి మనసును గెలుచుకున్న నాయకుడుగా మార్చాడు. మాస్ హీరో కలల్లో తేలుతోన్న బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆ ట్యాగ్ ను అద్భుతంగా తగిలించాడు. జయ జానకి నాయకతో బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీ డబ్బింగ్ ఓ రేంజ్ లో పెరిగింది. కానీ రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఒక ఫ్లాప్ తర్వాత మరోసారి బాలయ్యతో జత కట్టాడు. వీరి కాంబోలో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో వాటికి కూడా చెమటలు పట్టించేలా అఖండతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. అఖండ సాధించిన విజయం టాలీవుడ్ ను సర్ ప్రైజ్ చేసింది. కొన్ని కాంబినేషన్స్ కు ఉండే పవర్ ను మరోసారి ప్రూవ్ చేసింది అఖండ.
ప్రస్తుతం రామ్ తో సినిమా చేస్తున్నాడు బోయపాటి శ్రీను. హీరో ఎవరైనా సరే.. బోయపాటి డైరెక్ట్ చేస్తే అది బోయపాటి సినిమానే అవుతుంది. ఆయా హీరోలు కూడా అతనితో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. తమ ఎలివేషన్స్ ను చూసుకుని ఉప్పొంగిపోతారు. మొత్తంగా రామ్ తో కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటూ ఈ ఊరమాస్ డైరెక్టర్ కు మనమూ బర్త్ డే విషెస్ చెబుదాం..

, , ,