దర్శక ధీరుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ‌ధ్య చాలా మంచి స్నేహ బంధం ఉంది. వ‌య‌సు భేదం ఉన్న‌ప్ప‌టికీ ఇద్ద‌రి కెరీర్స్ ఒకేసారి షురూ అయ్యాయి. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, య‌మ‌దొంగ‌, RRR చిత్రాల్లో ఈ కాంబో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కుంది. అయితే RRR మ‌ల్టీస్టార‌ర్‌. అందులో రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టించారు. సినిమా రిలీజ్ త‌ర్వాత ఎన్టీఆర్ కంటే రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌కే స్కోప్ ఎక్కువ‌గా ఉంద‌ని నంద‌మూరి ఫ్యాన్స్ భావించారు. ఈ విష‌యంపై వారు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వ్య‌క్తప‌రిచిన సంగ‌తి తెలిసిందే.

RRR రిలీజ్ త‌ర్వాత జ‌క్క‌న్న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ వాటిని త‌ప్పు ప‌డుతూ ఓ లెట‌ర్ కూడా రిలీజ్ చేశారు. కానీ జ‌క్క‌న్న మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. త‌ర్వాత ఇద్ద‌రూ ఎక్క‌డా క‌లుసుకోలేదు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య ఎక్క‌డో చెడింద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. ఆ విష‌యం అబ‌ద్ద‌మ‌ని రుజువు కాబోతుంది. ఎందుకంటే రాజ‌మౌళి కోసం ఎన్టీఆర్ క‌దిలి వ‌స్తున్నారు. అస‌లు విష‌య‌మేమంటే.. బాలీవుడ్ హీరో ర‌ణ్‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ జంట‌గా అయాన్ ముఖ‌ర్జీ రూపొందించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమాను ద‌క్షిణాదిన రాజ‌మౌళి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నార‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

, , , , , , , , , , , ,