ఆచార్య వంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత వ‌చ్చిన మెగాస్టార్ మూవీ గాడ్ ఫాద‌ర్ ద‌స‌రా బ‌రిలో నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ గెలుచుకుంది. ఈ బ్లాక బ‌స్టర్ ఫ్యాన్స్ తో పాటు చిరంజీవికి సైతం మంచి రిలీఫ్ ను ఇచ్చింది అని చెప్పొచ్చు. ఓ ర‌కంగా ఇది ఆయ‌న‌కు ప్రిస్టీజియ‌స్ ప్రాజెక్ట్ కూడా. మొత్తంగా అంద‌రి అంచ‌నాల‌ను అందుకున్న గాడ్ ఫాద‌ర్ బ‌య్య‌ర్స్ లోనూ ఆనందాల‌ను నింపింది. అయితే దీంతో పాటు అద‌నంగా చిరంజీవికిమ‌రింత ఆనందాన్ని ఇస్తూ.. ఓవ‌ర్శీస్ లో కూడా దుమ్మురేపుతోందీ మూవీ. రీసెంట్ గా ఒన్ మిలియ‌న్ క్ల‌బ్ లో చేరిన గాడ్ ఫాద‌ర్ లేటెస్ట్ గా 1.1 గా మారింది.

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న గాడ్ ఫాద‌ర్ ఇటు తెలుగులోనూ అద‌ర‌గొడుతోంది. వీకెండ్స్ లోనే కాదు.. వీక్ డేస్ నూ స్ట్రాంగ్ గా నిలిచి ట్రేడ్ ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఓవ‌ర్శీస్ లో మెగాస్టార్ కు ఈ రేంజ్ విజ‌యం రావ‌డం మాత్రం మ‌రింత ఉత్సాహాన్నిస్తోంది. ఎందుకంటే చిరంజీవి సినిమా అంటే పాట‌లు, ఫైట్స్ ను ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియ‌న్స్. వారి అంచ‌నాల‌కు దూరంగా త‌న కెరీర్ లోనే ఫ‌స్ట్ టైమ్ అస‌లు హీరోయిన్నే లేకుండా చేసిన ఈ సినిమా అంత పెద్ద విజ‌యం సాధించ‌డం ఓ ర‌కంగా మెగాస్టార్ ఇక మారొచ్చు అనే సంకేతాల‌ను కూడా ఇస్తోంది.చిరంజీవితో పాటు స‌త్య‌దేవ్, న‌య‌న‌తార‌ల న‌ట‌న బిగ్ ఎసెట్ గా నిలిస్తే.. పూరీ జ‌గ‌న్నాథ్, స‌ల్మాన్ ఖాన్ అతిథి పాత్ర‌లు ప్ల‌స్ అయ్యాయి. ఓవ‌రాల్ గా ఈ ద‌స‌రా ఇత‌ర సినిమాలు నిరాశ‌ప‌రిచినా గాడ్ ఫాద‌ర్ అదర‌గొడుతున్నాడు

, , , , ,