సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మ‌హేష్ బాబు సోద‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్ బాబు క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 56 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న శ‌నివారం సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే గ‌చ్చిబౌలిలోని ఏఐజీ హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే ర‌మేష్ బాబు మృతి చెందిన‌ట్లుగా డాక్ట‌ర్లు ధృవీక‌రించారు.

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా బాల్యంలోనే తెరంగేట్రం చేశారు రమేష్ బాబు. కృష్ణ మనుషులు చేసిన దొంగలు చిత్రంలో బాల నటుడిగా నటించారు. ఆ తర్వాత కృష్ణ చేసిన అనేక చిత్రాల్లో బాల నటుడిగా నటించి, ఆ తర్వాత హీరోగా కెరీర్ ప్రారంభించారు. 1987 లో వి మధుసూదన్ రావు దర్శకత్వంలో సామ్రాట్ చిత్రంతో హీరోగా మారారు. రమేష్ బాబుకు భార్య మృదుల, కొడుకు జయకృష్ణ, కూతురు భారతి ఉన్నారు.

, , , , , , , , , , , , , , , , , , , , ,