రామ్ పోతినేని హీరోగా తాను ఓ సినిమాకు డైర‌క్ష‌న్ చేయ‌నున్న‌ట్టు గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్ అనౌన్స్ చేశారు. ఆయ‌న తెర‌కెక్కించిన త‌మిళ సినిమా వెందు త‌నింద‌దు కాడు. శింబు హీరోగా తెర‌కెక్కిన చిత్రం అది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మాట్లాడుతూ రామ్ సినిమా గురించి అనౌన్స్ చేశారు గౌత‌మ్ మీన‌న్‌.
గౌత‌మ్ మీన‌న్ కైండ్ ఆఫ్ సినిమాల‌కు తెలుగులో మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. ఏ మాయ చేశావే నుంచి మ‌న ద‌గ్గ‌ర గౌత‌మ్ సినిమాల‌కు స్పెష‌ల్ ఆడియ‌న్స్ ఉన్నారు.


ఎప్ప‌టి నుంచో గౌతమ్ డైర‌క్ష‌న్‌లో రామ్ హీరోగా ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్నార‌ట స్ర‌వంతి ర‌వికిశోర్‌. చాన్నాళ్లుగా దీని మీద వ‌ర్క‌వుట్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికి అన్నీ కుదిరాయ‌న్న‌ది డైర‌క్ట‌ర్ మాట‌.
మ‌రి ఇప్పుడైతే రామ్ త‌న నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నారు. బోయ‌పాటి డైర‌క్ష‌న్‌లో ఓ మాస్ యాక్ష‌న్ సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నారు రామ్‌. ఈ సినిమా కోసం న‌యా లుక్ లో మేకోవ‌ర్ అవుతున్నారు. గ‌డ్డం, లాంగ్ హెయిర్‌, బ‌ల్కీ మ‌జిల్స్ లో పోతినేని హీరో స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నారు. దీని త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్‌తో ఓ సినిమా చేస్తార‌న్న‌ది టాక్‌. మ‌రి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో హ‌రీష్ ప్ర‌స్తుతం క‌మిటైన ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తారో తెలియ‌దు. అందుకే ఆ ప్రాజెక్ట్ మీద 100 ప‌ర్సెంట్ కాన్ఫిడెంట్‌గా లేరు రామ్‌.


ప‌వ‌న్ సినిమాను హ‌రీష్ కంప్లీట్ చేసేలోపు. బోయ‌పాటి శ్రీను సినిమా కంప్లీట్ చేస్తారు రామ్‌. ఆ త‌ర్వాత మిస్ట‌ర్ పోతినేని… హ‌రీష్ సెట్స్ కి వెళ్తారా? లేకుంటే గౌత‌మ్ మీన‌న్ సెట్స్ కి వెళ్తారా అనేది స‌స్పెన్స్. రీసెంట్‌గా త‌మిళ డైర‌క్ట‌ర్ లింగుస్వామి డైర‌క్ష‌న్‌లో వారియ‌ర్ చేశారు రామ్. ఆ సినిమా ఆయ‌న అనుకున్న రేంజ్‌లో ఆడ‌లేదు. డాక్ట‌ర్ పోలీసైతే సీన్ ఎలా ఉంటుంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు లింగుస్వామి. అయితే థాట్ కొత్త‌గా ఉన్నా, క‌థ‌, స‌న్నివేశాల ప‌రంగా ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
అందుకే ఇప్పుడు స్టోరీ విష‌యంలో డ‌బుల్ చెక్ చేసుకుని ముందుకు వెళ్లాల‌నుకుంటున్నారు రామ్‌.

, , , , ,