సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే మాగ్జిమం ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో అందరికీ తెలుసు. యూత్ తో పాటు ఫ్యామిలీని, మాస్ ను ఏక కాలంలో ఎంటర్టైన్ చేయాలనుకుంటాడు మహేష్‌. అందుకు తగ్గ కథలనే సెలెక్ట్ చేసుకుంటాడు. అందుకే ఆయన తెలగు వరకే పరిమితమైనా యూనిక్ స్టార్ గా నిలిచాడు. తనకంటూ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్నాడు. సూపర్ స్టార్ గా తిరుగులేని స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి మహేష్‌ బాబు బెండ్ తీసేందుకు రంగం సిద్ధం చేస్తన్నాడు రాజమౌళి. యస్.. ఇప్పటి వరకూ సేఫ్ ప్లే లాగానే మహేష్ మూవీస్ కనిపించాయి. హీరో ఎక్కువగా కష్టపడిన సందర్భాలుండవు. అఫ్ కోర్స్ మహేష్‌ బాబు మాత్రమే కాదు.. ఇతర హీరోలూ దాదాపు సేఫ్ గానే ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. బట్.. కొందరు దర్శకుల చేతిలో పడితే మాత్రం ఇంక అంతే. ఒళ్లు హూనం అయిపోవాల్సిందే. అలాంటి దర్శకుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండే వ్యక్తి రాజమౌళి అని అందరికీ తెలుసు.

ఆయనతో వర్క్ చేయడం అంటే ఒళ్లు హూనం అనే మాట కూడా చిన్నదే అని ప్రతి హీరో చెబుతాడు. ఇంక యాక్షన్ సీక్వెన్స్ ల సంగతి చెప్పక్కర్లేదు. ఎముకలు విరిగిపోయేలా, రియాలిటికీ దగ్గరగా యాక్షన్ స్టంట్స్ ఉండేలా ప్లాన్ చేయిస్తుంటాడు రాజమౌళి. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ లో అవి ఏ రేంజ్ లో ఉంటాయో ఆల్రెడీ చూశాం. ఇక నెక్ట్స్ మూవీ మహేష్‌ బాబుతోనే కదా..? అందుకే అంతా ఇక మహేష్‌ ను కూడ మడత బెడతాడు అనుకున్నారు. అది నిజమే అనేలా లేటెస్ట్ గా రాజమౌళి వ్యాఖ్యలు ఉన్నాయి.ప్రస్తుతం రాజమౌళి టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో డెలిగేట్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అక్కడే ఆయన్ని నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అడిగారు కొందరు మీడియా వాళ్లు. ఆ టైమ్ లో జక్కన్న చెప్పిన మాటలు ఇప్పుడు ఇండియా అంతా మార్మోగిపోతున్నాయి. అతనేమన్నాడు అంటే “గ్లోబట్రేటింగ్ యాక్షన్ ఎడ్వెంచర్” సినిమాను మహేష్‌ బాబుతో తీయబోతున్నాను అని చెప్పాడు.

అంటే దానర్థం ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా వ్యాప్తి చెందే అని అంట. ఇది ట్రూ ట్రాన్స్ లేషన్ లో కనిపిస్తోన్న పదమే తప్ప.. నిజానికి ఖచ్చితంగా అర్థమేంటో ఇంకా తెలియడం లేదు. అంటే ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీ చేస్తున్నాడు అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్‌ బాబు బాడీ బెండ్ అయిపోవడం ఖాయం అని చెప్పుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ లో అయినా ఇద్దరు హీరోలున్నారు. ఇక్కడ ఒక్కడే. అంటే సీన్ సితారైపోతుందన్నమాట.ఇక ఈ చిత్రం అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఓ హాంటింగ్ మూవీ అంటున్నారు. ఏదేమైనా రాజమౌళి సినిమా ప్రారంభించే రోజే కథేంటో చెబుతాడు కాబట్టి.. ఈ మూవీ ఓపెనింగ్ వరకూ ఆగాల్సిందే.

, , , , ,