నాగార్జున 100వ సినిమా కోసం నలుగురు దర్శకులు పనిచేస్తున్నారు. అయితే ఆ నలుగురిలో ఒక్కరు మాత్రమే 100వ సినిమాకు డైరక్ట్ చేస్తారు. తన కెరీర్‌లో మైల్‌స్టోన్‌ 100వ సినిమా ఎలా ఉండాలో రీసెంట్‌ ఇంటరాక్షన్‌లో రివీల్‌ చేశారు కింగ్‌ అక్కినేని నాగార్జున. నాగార్జున 100వ సినిమా కోసం నలుగురు దర్శకులు కథలు సిద్ధం చేశారట. ఇప్పుడు నాగార్జున వాటిని వింటున్నారు. వాటిలో ఏ ఒక్కదాన్నో సెలక్ట్ చేసుకుని సినిమాను మొదలుపెడతారు. అయితే ఆ నలుగురు దర్శకులు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నది కింగ్‌ కాంపౌండ్‌ నుంచి వస్తున్న మాట.

నాగార్జున ఆ మధ్య మాట్లాడుతూ ”నా 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా విజువల్‌ స్పెక్టాకులర్‌ మూవీనే చేస్తాను. జనాలను థియేటర్లకు తీసుకొచ్చే కంటెంట్ ఉన్న కథ కోసమే ఎదురుచూస్తున్నా. అది బ్రహ్మాస్త్రలాంటి పే…ద్ద సినిమా కావాల్సిన అవసరం లేదు. విజువల్‌ ఎఫెక్స్ట్ మెండుగా ఉండక్కర్లేదు. కానీ జనాలను థియేటర్లకు రప్పించాలి. రీసెంట్‌ టైమ్స్ లో సీతారామమ్‌ క్యూట్‌ లవ్‌స్టోరీతో అద్భుతంగా జనాల మనస్సుల్లో నిలిచిపోయింది. అలా ప్రేక్షకుల మనసులను తాకి, కదిలించి, థియేటర్లవైపు అడుగులు వేయించే సినిమా అయితే చాలు.

అందుకే కథలు వింటున్నా. మాస్‌ని ఆకట్టుకునే ఏ సినిమా అయినా ఓకే” అని అన్నారు.నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్ ఒన్‌ శివ ఇటీవల రిలీజైంది. నార్త్ లో 200 కోట్లకు పైగా వసూలు చేసింది శివ. అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. అదే రోజు చిరంజీవి గాడ్‌ఫాదర్‌తో తలపడుతోంది ఘోస్ట్. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు. ఘోస్ట్ హిట్‌ అయితే 2022లో హ్యాట్రిక్‌ హిట్‌ ఉన్న స్టార్‌ హీరోగా రికార్డ్ క్రియేట్‌ చేస్తారు అక్కినేని నాగార్జున.

, , , , , , ,