Advertisement
“పుష్ప” ఎఫెక్ట్.. భారీగా రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన బ‌న్నీ
Latest Movies Tollywood

“పుష్ప” ఎఫెక్ట్.. భారీగా రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన బ‌న్నీ

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఇది బ‌న్నీ, సుక్కూ.. ఇద్ద‌రికీ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ. దీంతో బాలీవుడ్ లో ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుందో అనుకుంటే… అంచ‌నాల‌కు మంచి పుష్ప భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో 80 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి అంద‌రికీ షాక్ ఇచ్చింద‌ని చెప్ప‌చ్చు. దీంతో బ‌న్నీకి బాగా డిమాండ్ పెరిగింది.

బాలీవుడ్, కోలీవుడ్ లోని బ‌డా ప్రొడ్యూస‌ర్స్ బ‌న్నీతో పాన్ ఇండియా మూవీ చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. తాజా వార్త ఏంటంటే… కోలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ‌న్నీతో పాన్ ఇండియా మూవీ చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపించింద‌ని.. బ‌న్నీ కూడా ఓకే చెప్పార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్రేజీ మూవీకి కోలీవుడ్ డైరెక్ట‌ర్స్ అట్లీ కానీ.. మురుగుదాస్ కానీ.. ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే అట్లీ, మురుగుదాస్… బ‌న్నీ కోసం క‌థ‌లు రెడీ చేస్తున్నార‌ని తెలిసింది. వీరిద్ద‌రిలో ఎవ‌రి క‌థ బాగుంటే… వాళ్ల‌కే బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నున్నార‌ని టాక్. అయితే…. ఈ మూవీ కోసం బ‌న్నీ భారీగా 75 కోట్ల పారితోషికం అడిగారని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి పుష్ప ఎఫెక్ట్ తో బ‌న్నీకి క్రేజీ బాగా పెరిగింది.

Advertisement