ఎవరిని చూసి పెట్టుకున్న వాతలివి ఏజెంట్ ..?

స్పై థ్రిల్లర్.. ఆల్వేస్ బెస్ట్ సెల్లర్ అంటారు. అంటే గూఢచారి కథ అంటే ఎప్పుడైనా ఆసక్తిగానే చెప్పొచ్చు. మన దేశానికి ప్రమాదం తలపెట్టే విలన్. వాడికి సహకరించే మరిన్ని శతృదేశాలు.. వారి రహస్యాలేంటో తెలియకుండా మన అధికారులకు తెలియదు. చివరికి ఓ సాహసవంతుడైన గూఢచారి ముందుకు వచ్చి ప్రాణాలు ఫణంగా పెట్టి శతృ రహస్యాలు ఛేదిస్తూ.. మన దేశానికి ప్రమాదాలు తప్పిస్తూ ఉంటే దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతారు.

అంటే దీనికి సరైన కథ ఉండాలి. కథనం ఆసక్తికరంగా రాసుకోవాలి. ఈ తరహా చిత్రాలు దాదాపు అన్ని దేశాల్లోనూ ఉంటాయి. కాబట్టి మనవైన ఎమోషన్స్ ను కూడా యాడ్ చేయాలి. అప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. బట్ ఇవేవీ లేకుండానే తీసిన సినిమాగా ఏజెంట్ ను చూడొచ్చు. నిజానికి ఈ మూవీకి సంబంధించి దర్శకుడు సురేందర్ రెడ్డికి నిర్మాత అన్నీ సమకూర్చాడు. హీరో కూడా అడిగిన పని అంతా చేసినట్టే ఉన్నాడు. కండలు పెంచాడు. కావాల్సినంతగా కష్టపడ్డాడు. అతని హార్డ్ వర్క్ అన్ని ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది. అయినా సినిమా పోయిందంటే ఖచ్చితంగా దర్శకుడి వైపే అందరి చూపూ ఉంటుంది.


సురేందర్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నాడు అనే దానికంటే ఎలా చెప్పాడు అనేదే అసలు పాయింట్. ఈ విషయంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. గతంలో అతను ధృవ లాంటి సినిమా తీశాడు కాబట్టి.. ఈ స్పై థ్రిల్లర్ ను కూడా బాగా హ్యాండిల్ చేస్తాడు అనుకున్నారు. బట్ ధృవ రీమేక్. పైగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ దింపేశాడు. అంటే దానర్థం �