ప్రభాస్ ‘టైర్’ స్పెషాలిటీ ఏంటీ…?

వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఏ ప్రాజెక్ట్ చేసినా అది యూనివర్సల్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేదిలా ఉంటేనే ఓకే చెబుతున్నాడు. ఈ క్రమంలో బాహుబలి తర్వాత వచ్చిన సాహో యావరేజ్ అయితే రాధేశ్యామ్ డిజాస్టర్ గా నిలిచింది. అయినా అతని క్రేజ్ తగ్గలేదు. అది బాహుబలి ఇచ్చిన ఇమేజ్.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న సలార్ మూవీ చివరి దశకు వచ్చింది. ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఆదిపురుష్‌ మరోసారి పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లింది. ఈ యేడాది ఈ మూవీ ఉంటుందా లేదా అనేది డౌట్. ఇటు మారుతి డైరెక్షన లో రాజా డీలక్స్(వర్కింగ్ టైటిల్) కూడా స్టార్ట్ అయింది. అయితే అన్నిటికంటే ఎక్కువ ఎగ్జైట్ చేస్తోన్న మూవీ ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో దీపికా పదుకోణ్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అలనాటి మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.. కథ సహకారం అందించారు.

ఎలా చూసినా క్రేజీయొస్ట్ ప్రాజెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ కే ను చెబుతున్నారు. ఆ విషయాన్ని మరోసారి హైలెట్ చేస్తూ లేటెస్ట్ గా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే.. ఈ మూవీ కోసం స్పెషల్ గా ఓ టైర్ ను రెడీ చేశారు. ఇందుకోసం చాలా చాలా టైమ్ తీసుకున్నట్టుగా ఈ వీడియోలో కనిపించింది. కొందరు వర్కర్లైతే ఇంతోటి టైర్ కోసం ఇంత కష్టపడాలా.. షోరూమ్ కు వెళితే ఏవైనా దొరుకుతాయి కదా అని విసుక్కుంటున్నారు కూడా. బట్ ఫైనల్ గా టైర్ చూస్తే కాస్త ఆశ్చర్యంగా ఉంది. వెరైటీగానూ ఉంది.


చూస్తోంటే ఈ టైర్ కు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా కనిపిస్తోంది. లేకపోతే ఇంత పెద్ద వీడియో దీనికోసం సిద్ధం చేయరు కదా..? ఇలాంటివి మామూలుగా హాలీవుడ్ మూవీస్ లో కనిపిస్తాయి. ఈ మూవీ కూడా ఆ రేంజ్ లోనే వస్తోంది కాబట్టి ఆ తరహాలోనే వెళుతున్నారేమో. మరోవైపు ఇది ప్రభాస్ ను ఎక్కడికైనా తీసుకువెళ్లే వాహనం లాంటిదిలానూ కనిపిస్తోంది. ఏదేమైనా ఈ టైర్ మాత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. మరి మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో కానీ ఇప్పటికే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.

Related Posts