కథలు కావాలా.. చిరంజీవి వద్దకు వెళ్లండి.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలాగే ఉంది పరిస్థితి. ఎందుకంటే మెగాస్టార్ సినిమా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉంటున్నాడో.. ఖాళీ దొరికితే కథలు వినడంలోనూ అంతే బిజీగా ఉంటున్నాడు. ముఖ్యంగా యంగ్ స్టర్స్ చెప్పే కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. వీరిలో దర్శకులు మాత్రమే కాదు.. కేవలం రచయితలు కూడా ఉంటున్నారు. ఎవరి కథైనా నచ్చితే వెంటనే బావుందని చెప్పడం లేదంటే మార్పులు చెప్పడం ఇంకా లేదూ అంటే బాలేదు అని నిర్మొహమాటంగా చెప్పివారి టైమ్ ను సేవ్ చేయడం లాంటివి చేస్తున్నాడట. ఈ క్రమంలో ఈయన విన్న కథల్లో నుంచి తనకు బాగా సూట్ అవుతాయి అనుకున్నవి ఇప్పుడు నాలుగు ఉన్నాయంటున్నారు. మరి ఆ నాలుగు కథలేంటీ.. ఎవరెవరు చెప్పారు..?.


చిరంజీవి లాంటి సీనియర్ హీరో ఓ కథను జడ్జ్ చేయడంలో ఎలాంటి మెజర్మెంట్స్ ఫాలో అవుతాడు అనేది అంత ఈజీగా తెలియదు. బట్ ఓ కథ వింటున్నప్పుడు దాన్ని విజువలైజ్ చేయడం వారికి కొట్టిన పిండి. ఏ సీన్ ఏ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందనేది స్పష్టంగా తెలిసే ఉంటుంది. అందుకే ఏ మాత్రం మొహమాటినికి తావు లేకుండా ఆయా స్టోరీస్ ను జడ్జ్ చేస్తున్నాడట. ఈ క్రమంలో బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ట .. రామ్ చరణ్ కోసం ఓ కథ చెప్పడానికి వెళ్లాడు. అదే టైమ్ లో తన వద్ద ఉన్న ఇతర ఐడియాస్ ను కూడా షేర్ చేసుకున్నాడు. ఆ ఐడియాస్ లో ఒకటి మెగాస్టార్ కు బాగా నచ్చింది. వెంటనే చరణ్ సంగతి తర్వాత ముందు ఇది తనకోసం డెవలప్ చేయమన్నాడు. కుదిరితే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే ఐనా ఆశ్చర్యం లేదు.


వశిష్టతో పాటు బివిఎస్ రవి కూడా ఓ స్టోరీ చెప్పాడు. అదీ చిరంజీవికి నచ్చింది. అయితే ఈ కథను అతను కాకుండా వేరే వారితో డైరెక్ట్ చేయించాలనుకుంటున్నాడు. ఇక ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పిన స్టోరీకీ మెగాస్టార్ ఓకే అన్నాడు. ఇతను ప్రస్తుతం నాగార్జున సినిమాతో దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ ఏకంగా రెండు కథలు చెప్పి ఓకే చేయించుకున్నాడు. వీటిలో ఏ కథ ముందుగా పట్టాలెక్కుతుందో కానీ.. దర్శకుడుగా అతనికే అవకాశం ఉంటుంది. సో.. మెగాస్టార్ వద్ద ఇవేకాక ఇంకా ఐడియాస్ గా చెప్పిన కథలు కూడా చాలానే ఉన్నాయట. మరి ఎవరికైనా కథలు కావాలంటే ముందుగా మెగాస్టార్ ను అప్రోచ్ అయితే సరిపోతుందేమో..?

, , , , , , , , , ,