విరూపాక్ష ఒక్కడే ఆదుకున్నాడు-టాలీవుడ్ ఏప్రిల్ రివ్యూ

ఒక బ్లాక్ బస్టర్ పడగానే ఆ ఊపును తర్వాతి సినిమాలు కూడా కొనసాగిస్తాయని చాలామంది భావిస్తుంటారు. బట్ అలాంటివి చాలా చాలా అరుదుగా కనిపిస్తాయి సినిమా పరిశ్రమలో. అందుకే మన సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఈ ఏప్రిల్ లో వచ్చిన సినిమాల్లో విరూపాక్ష తప్ప విజయం అందుకున్న సినిమాలు మరేవీ లేకపోవడం గమనార్హం. ఫస్ట్ వీక్ ఏప్రిల్ 7న వచ్చిన రావణాసుర, మీటర్.. ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాప్ అనిపించుకున్నాయి.

ఆ తర్వాతి వారం 14న వచ్చిన శాకుంతలం సినిమా ఫ్లాప్ మాత్రమే కాదు.. అనేక విమర్శలనూ మూటకట్టుకుంది. సమంతతో పాటు దర్శక, నిర్మాత గుణశేఖర్ చాలా అంచనాలు పెట్టుకున్న చిత్రం ఇది. బట్.. వాటిని అందుకోవడంలో మూవీ దారుణంగా ఫెయిల్ అయింది. ఏప్రిల్ 21న విరూపాక్ష వచ్చింది. ప్రమోషన్స్ లేక జనాలకు తెలియలేదు కానీ.. ఈ మూవీతో పాటు అదే రోజు టెన్ రూపీస్, హలో మీరా, టూ సోల్స్ అనే మూడు చిన్న సినిమాలూ వచ్చాయి.

ఈ పేర్లు చెబుతుంటేనే ఎప్పుడూ వినిపించలేదు అనిపిస్తోంది కదా..? ఇంక ఆ సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా..?


ఇక కార్తీక్ దండు డైరెక్షన్ లో లక్కీ బ్యూటీ సంయుక్త హీరోయిన్ గా వచ్చిన విరూపాక్ష మాత్రం అద్బుతం చేసింది. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత వచ్చిన ఈ మూవీ 25 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో రిలీజ్ అయింది. మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సాయంత్రానికే హౌస్ ఫుల్ బోర్స్ పడ్డాయి. అటు ఓవర్శీస్ లో కూడా తేజ్ ను ఫస్ట్ ఒన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేర్చిందీ చిత్రం. ఇప్పటి వరకూ 57కోట్ల గ్రాస్.. 42 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే కొన్నవాళ్లంతా ఎప్పుడో లాభాల్లోకి వచ్చేశారు. ఎవరికి ఎంత లాభాలు అనేదే ఇంక తేలాలి. ఓ రకంగా తేజ్ కెరీర్ లో కూడా ఇదే బిగ్గెస్ట్ హిట్ గా కొన్నాళ్ల పాటు నిలుస్తుందని కూడా చెప్పొచ్చు.


ఇక చివరి వారంలో భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్.. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తలా తోక లేని కథ, కథనాలతో కావాల్సినంతగా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. రిలీజ్ కు ముందు చాలానే చెప్పినా.. సినిమాలో మేటర్ లేదని మ్యాట్నీకే థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. దీంతో పాటు రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్ 2కు ఓపెనింగ్స్ లేవు. కాకపోతే ఏజెంట్ కంటే బెటర్ అనిపించుకుంది.

ఫస్ట్ పార్ట్ లో ఉన్న కన్ఫ్యూజన్స్, డౌట్స్ అన్నిటినీ సెకండ్ పార్ట్ లో క్లియర్ చేశారు. సో.. మొదటి భాగం చూసి చిరాకు పడ్డవారికి ఈ రెండో భాగంతో ఓ క్లారిటీ వస్తుంది. దీనికి తోడు రివ్యూస్ కూడా ఫర్వాలేదు అనేలా ఉన్నాయి కాబట్టి వీకెండ్ వరకూ ఏమైనా పికప్ అవ్వొచ్చేమో కానీ.. హిట్ అవుతుందని మాత్రం చెప్పలేం. ఏదేమైనా ఏప్రిల్ లో ఇన్ని సినిమాలు వస్తే ఒక్క విరూపాక్ష మాత్రమే విజయం సాధించడం చూస్తోంటే టాలీవుడ్ లో ఎలాంటి కంటెంట్ బయటికి వస్తోందో అర్థం అవుతోంది కదా..?

Related Posts