HomeMoviesటాలీవుడ్‘గేమ్ ఛేంజర్‘ నుంచి రెండో పాట ‘రా మచ్చా మచ్చా‘

‘గేమ్ ఛేంజర్‘ నుంచి రెండో పాట ‘రా మచ్చా మచ్చా‘

-

‘గేమ్ ఛేంజర్‘ పాటల పండగ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘జరగండి‘కి మంచి రెస్పాన్స్ దక్కింది. తొలి పాట విడుదల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న టీమ్.. ఇప్పుడు రెండో పాటపై స్పెషల్ అప్డేట్ అందించింది. ‘గేమ్ ఛేంజర్‘ నుంచి రెండో పాటగా ‘రా మచ్చా మచ్చా‘ రాబోతుందని ప్రకటించింది నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్. త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారట.

Image 174

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‘ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. శంకర్ సినిమా అంటేనే ఎంతో భారీతనంతో ఉంటుంది. అలాగే.. ఆయన తీర్చిదిద్దే పాటలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ‘గేమ్ ఛేంజర్‘లోని పాటల గురించి ఇప్పటికే నిర్మాత దిల్ రాజు భారీ హైప్ పెంచేశారు. ఈ సినిమాలోని ఓ మూడు పాటలు అయితే.. ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోనివ్వవు అంటూ హింట్ ఇచ్చారు. మొత్తానికి ‘జరగండి‘ కోసమే దాదాపు రూ.15 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్.. మరి.. ‘రా మచ్చా మచ్చా‘తో ఎలాంటి విజువల్ ట్రీట్ అందిస్తాడో చూడాలి. డిసెంబర్ 20న ‘గేమ్ ఛేంజర్‘ విడుదలకు ముస్తాబవుతోంది.

ఇవీ చదవండి

English News